'సూపర్ సిక్స్' అమలు లేనట్టేనా..? ఒక్క మాటతో తేల్చేసిన సీఎం చంద్రబాబు
అనేక హామీలను ఇచ్చి ఏపీలో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు సర్కార్. వైసీపీ కంటే కూడా రెట్టింపు హామీలు ఇచ్చి..వాటికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లారు.సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు ఆకర్షితులు అయ్యేలా ప్రచారం చేయడంలో టీడీపీ, జనసేన నేతలు సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఉచిత పథకాలకు బీజేపీ మొదటి నుంచి దూరంగానే ఉంది. అందుకే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల రోజు కూడా బీజేపీ నేతలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం జరిగింది. అందరు అనుకున్నట్టే బంపర్ మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు దివ్యాంగులకు ఇతర వర్గాలకు సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానిని ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ జూలైలో ఏడు వేల రూపాయల పెన్షన్‌ని కూడా ఇచ్చారు.
దీంతో చంద్రబాబు వరసబెట్టి అన్ని హామీలను అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అక్కడే బాబు రాజకీయ చతురతను ప్రదర్శించారు. అన్ని హామీలను అమలు చేస్తే ,క బడ్జెట్‌లో ఏడాదికి అదనంగా మరో లక్షన్నర కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. అప్పుల కోసం తిప్పలు పడాలి. ఇప్పటికే ఏపీ అన్ని రకాలుగా నష్టపోయింది. ఏ విధంగా చూసినా అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం పంపించారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను వివరిస్తూ ఆయన శ్వేత పత్రాలను విడుదల చేశారు. అన్నీ చెబుతూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ అమలు విషయంలో కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బాగాలేనందు వల్ల తాను ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉందని అన్నారు. ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన కోరడం విశేషం. దీంతో సూపర్ సిక్స్ అమలుపై అనుమానాలు మొదలైయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 మొదలగు పథకాలు కోసం మహిళలు ఎంతో అతృతుగా ఎదురు చూస్తోన్న పరిస్థితి. అయితే అసెంబ్లీ సాక్షిగా పథకాలను అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టేశారు.
దీంతో అధికార పక్షాన్ని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమలు చేయలేని హామీలను ఇచ్చి , ఇప్పుడు వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయని, అయిన కూడా జగన్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా హామీలను అమలు చేశారనే విషయాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తు చేశారు. కరోనా వంటి కష్ట సమయంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపింది లేదని ఆయన తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి 6 నుంచి 7 వేల కోట్లు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, అయినప్పటికి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్దారు.












Click it and Unblock the Notifications