చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి డిమాండ్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన శ్రీదేవి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేత, తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సుగుణమ్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆమె అన్నారు.
కాగా, తెలుగుదేశం అభ్యర్థి సుగుణమ్మ చేతిలో పరాజయం పొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. సుగుణమ్మ ఈ ఎన్నికల్లో లక్షా 16వేల ఓట్ల మేజార్టీతో గెలుపొందింది.
ఇది ఇలా ఉండగా ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం సుగుణమ్మ మాట్లాడుతూ.. గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దురుద్దేశ పూర్వకంగానే పోటీ చేసిందని ఆరోపించారు.

తన గెలుపు ప్రజల విజయంగా సుగుణమ్మ అభివర్ణించారు. ఎవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.
కేంద్రమంటే బాబుకు భయమెందుకు?: రఘువీరా
విభజన చట్టాన్ని అమలు చేసే ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీకి లేదా? అని ఏపి పిసిసి చీఫ్ రఘువీరా ప్రశ్నించారు. అహ్మదాబాద్‌కు వేల కోట్లు కేటాయిస్తున్న మోడీ... ఏపిని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలులో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు చంద్రబాబుకు భయమెందుకన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పులిలా.. కేంద్రంలో పిల్లిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications