Chandrababu: శ్వేతపత్రాల విడుదల వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార టిడిపి కూటమి శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని శాఖల వారీగా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, పారదర్శక పాలన అందించాలన్న ఉద్దేశంతో శ్వేత పత్రాలను విడుదల చేయడానికి నిర్ణయించిన చంద్రబాబు తొలి శ్వేత పత్రంగా పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని విడుదల చేశారు.
చంద్రబాబు శ్వేత పత్రాల రిలీజ్ వెనుక మాస్టర్ మైండ్
అయితే చంద్రబాబు ఈ శ్వేత పత్రాలను విడుదల చేయాలని అసలు ఎందుకు భావిస్తున్నారు? శ్వేత పత్రాల విడుదల వెనుక చంద్రబాబు మాస్టర్ మైండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..వైసిపి ప్రభుత్వం తాము సంక్షేమ పాలన చేసామని, ప్రజా రంజక పాలన కొనసాగించామని చెబుతోంది. తమది సంక్షేమ ప్రభుత్వమని, తమ పాలన గొప్పగా సాగిందని వైసిపి నేతలు పదే పదే చెబుతున్నారు.

వైసీపీకి చెక్ పెట్టే ప్లాన్ లో చంద్రబాబు
తాము ఎటువంటి తప్పులు చేయలేదని, తామంతా మంచి చేశామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు మరికొద్ది రోజుల్లో ప్రజా సమస్యల కోసం రోడ్డు ఎక్కుతామంటూ, చంద్రబాబు ప్రజలకు ఇస్తామని వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటూ వైసీపీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. దీంతో వైసీపీకి చెక్ పెట్టడానికి రాష్ట్రంలో వైసిపి పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలియడం కోసం చంద్రబాబు స్వేత పత్రాల విడుదలకు శ్రీకారం చుట్టారు.
గత ప్రభుత్వం విధ్వంసం చెప్పనున్న చంద్రబాబు
ఈ క్రమంలోనే ఏడు శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాలను చంద్రబాబు విడుదల చేయనున్నారు. వీటిలో పోలవరం, అమరావతి, ఆర్థిక శాఖ, పర్యావరణం, గనులు, అప్పులు వంటివి ప్రధానంగా వివరించనున్నారు. ఆయా శాఖలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, ఫలితంగా చోటుచేసుకున్న విధ్వంసం చంద్రబాబు ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు.
వైసీపీ నేతల నోళ్లకు తాళం వేసే ప్లాన్
జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా అప్పులపాలైంది అనేది చంద్రబాబు వివరించనున్నారు. ఇలా రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసిందో చెబితే వైసీపీకి చెక్ పెట్టినట్టు అవుతుందని, వైసిపి నేతల నోళ్లకు తాళం పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాదు ఇలా రాష్ట్రం ఉన్న పరిస్థితులను.. తాను చక్కదిద్దే ప్రయత్నం చేస్తానని చెప్పనున్నారు. మరి చంద్రబాబు ఆలోచన ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications