శ్రీధర్ బాబు చేతిలో ప్రోరోగ్: కిరణ్ వ్యూహానికి దెబ్బ

శాసనసభను ప్రోరోగ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు నెలరోజుల క్రితమే లేఖ రాశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రోరోగ్‌కు సంబంధించి ఒక ఫైల్‌ను రూపొందించి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు మూడు రోజుల క్రితం పంపించారు. నిబంధనల ప్రకారం ఫైలును శ్రీధర్‌బాబు పరిశీలించి, సంతకం చేసిన తర్వాత దీన్ని ముఖ్యమంత్రికి పంపించాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రి దీనిపై సంతకం చేసిన తర్వాత గవర్నర్‌కు పంపించాలి. తర్వాత గవవర్నర్ ఆమోదం రాగానే శాసనసభను ప్రోరోగ్ చేస్తున్నట్టు గవర్నర్ సచివాలయం అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ మొత్తం క్రమంలో ప్రస్తుతం ప్రోరోగ్‌కు సంబంధించిన ఫైలు స్పీకర్ నుండి మంత్రి శ్రీధర్‌బాబు వద్దకు చేరింది. శాసనసభను ప్రోరోగ్ చేసేందుకు శ్రీధర్‌బాబు సహా తెలంగాణ మంత్రులెవరికీ ఇష్టం లేదు. శ్రీధర్‌బాబు సంతకం లేకుండా ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరేందుకు వీలుకాదు. ఇది రాజ్యాంగం కల్పించిన విధానం. ఈ ఫైలును ఎన్నిరోజులైనా శ్రీధర్‌బాబు తన వద్దే ఉంచుకునేందుకు వీలుంది.
శాసనసభ శీతాకాలం సమావేశాలు 2013 డిసెంబర్ 20లోగా కాని, 20 నుండి తప్పని సరిగా జరగాల్సి ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నందు వల్ల, ఈ దశలో సభను ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని, ‘సైన్ డై'గానే కొనసాగిద్దామని శ్రీధర్‌బాబు తిరిగి స్పీకర్‌కు లేఖ రాసే అవకాశం ఉందని తెలిసింది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో చర్చకు పెట్టవచ్చు, లేదా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications