ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ రిలీఫ్ - ఆరు నెలల పొడిగింపు : పీఆర్సీపైనా చర్చలు...!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా పీఆర్సీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. ఈ రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటికే ఇచ్చిన హామీ మేరకు 27 శాతం మధ్యంత భ్రుతి ప్రకటించారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించటంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. కొద్ది నెలలుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు..పెన్షనర్లకు పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయి.

నెలాఖరులోగా పీఆర్సీ పైన నిర్ణయం

నెలాఖరులోగా పీఆర్సీ పైన నిర్ణయం

పెన్షన్లు పదో తేదీ దాటినా ఇస్తూనే ఉన్నారు. దీంతో..ఉద్యోగ సంఘాల నేతల మీద ఉద్యోగులు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో..ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సమావేశం అయిన ఉద్యోగ సంఘాలకు ఈ నెలాఖరు లోగా పీఆర్సీ పైన నిర్ణయం ఉంటుందనే హామీ లభించింది. అదే విధంగా ఒకటో తేదీ జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిగిలిన ఉద్యోగుల సమస్యల పైన వచ్చేనెలాఖరు నాటికి పరిష్కారం చూపుతామని స్పష్టత ఇచ్చారు.

ఉద్యోగులకు బ్యాచ్ లర్ అకామిడేషన్

ఉద్యోగులకు బ్యాచ్ లర్ అకామిడేషన్

ఇక, ఇదే సమయంలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు గృహవసతి సదుపాయం మరో ఆరు నెలలు పొడిగించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘం ముఖ్యమంత్రి జగన్‌ని కోరింది. ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఉచిత గృహవసతి సదుపాయం మరో 6 నెలలు పొడిగించేందుకు అంగీకరించారు అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి పాలనా వ్యవహారాలను మార్చారు.

ఆరు నెలల పాటు పొడిగింపుకు సీఎం అంగీకారం

ఆరు నెలల పాటు పొడిగింపుకు సీఎం అంగీకారం

ఆ సమయంలో సడన్ గా హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం ఏడాది పాటు ఉచిత వసతి కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో వారికి బ్యాచిలర్ అకామిడేషన్ కల్పించారు. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. అదే విధంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఉదయం సికింద్రాబాద్ లో ఎంప్లాయిస్ ట్రెయిన్ ఏర్పాటు చేసారు. తిరిగి సాయంత్రం విజయవాడ నుంచి ఆ రైలు బయల్దేరుతుంది.

Recommended Video

    Palamuru-Rangareddy Project:NGT లో బలంగా వాదనలు AP VS TS Govt | Irrigation Projects| Oneindia Telugu
    పీఆర్సీ..సీపీసీ పైనే ఉద్యోగుల ఫోకస్

    పీఆర్సీ..సీపీసీ పైనే ఉద్యోగుల ఫోకస్

    ఇక, జగన్ సీఎం అయిన తరువాత ఈ రెండున్నారేళ్ల కాలం కూడా అదే విధంగా సచివాలయంతో పాటుగా హెచ్ఓడీల్లో పని చేసే ఉద్యోగులకు బ్యాచిలర్ అకామిడేషన్ కొనసాగించారు. కానీ, ఈ నెలాఖరుతో దానిని ముగిస్తూ..వచ్చే నెల నుంచి ఆ అవకాశం ఉండదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇదే అంశం పైన ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం..ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున ఆ సంఘ నేతలు సీఎం ను కలిసి దీనిని మరి కొంత కాలం పొడిగించాలని కోరారు. దీనికి సానుకూలం గా స్పందిన సీఎం ఆరు నెలల పాటు ఇప్పుడున్న విధంగానే ఉచిత గృహా వసతి కొనసాగించాలని కోరగా.. సీఎం అంగీకరించారు. దీంతో.. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాచిలర్ అకామిడేషన్ 2022 మార్చి నెలాఖరు వరకు యధాతధంగా కొనసాగనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+