సీఎం జగన్ మనసువిప్పి : అవి వివాదాస్పద నిర్ణయాలే..కానీ, ఎందుకంటే : రాయబారులతో ఇలా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మనసు విప్పి మాట్లాడారు. తాను కొంత కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమేనని అంగీకరించారు. కానీ, అటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించా రు. ఏపీలో పెట్టుబడుల ఆహ్వానం కోసం నిర్వహిస్తున్న విదేశీ రాయబారుల సదస్సులో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ముఖ్యమంత్రిగా అయిన సమయంలో ఏపీలో ఆర్దిక పరిస్థితి గురించి దాపరికం లేకుండా వివరించారు. పీపీఏల సమీక్ష .. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు యువత విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమేనని..అయితే ఆ నిర్ణయాల వెనుక ఉన్న సదుద్దేశాలను అర్దం చేసుకోవాలని సూచించారు. తమ బలహీనతలు అందరికీ తెలుసంటూనే..తమ బలాల గురించి వివరించారు. తమకు కేంద్ర సహకారం ఉందని..పెట్టుబడులకు పూర్తి అవకాశాలు ఉన్న ప్రాతంగా ఆంధప్రదేశ్ అంటూ చెప్పుకొచ్చారు. కేవలం మీలో విశ్వాసం పెంచేందుకే అన్ని విషయాలు చెబుతున్నానని సీఎం జగన్ వివరించారు.

రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం..
ఏపీ ప్రజలు తమకు గొప్ప విజయాన్ని అందించారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కేంద్రం .. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విదేశీ రాయబారుల సదస్సులో ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రసంగం చేసారు. ఏపీ ఆర్దిక ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. ఈ సదస్సుకు యూఎస్‌ఏ, యూకే, కెనడా, జపాన్, కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా 35 దేశాల హైకమిషనర్లు హాజరయ్యారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందని, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఏపీలో 4 నౌకా పోర్టులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని జగన్ చెప్పారు. ఏపీకి అపారమైన కోస్తా ప్రాంతం ఉందన్నారు. టెండర్ల నుంచి కేటాయింపుల దాకా అవినీతి రహిత నిర్ణయాలను తీసుకుంటున్నామని జగన్ వివరించారు. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీలు లేకపోవడం ఏపీకి ఇబ్బందికరమే అయినప్పటికీ..ఇక్కడ తీర ప్రాంతం అతిపెద్ద వనరు అని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు తమ పార్టీకి ఉన్నారన్నారు. జాతీయ స్థాయిలో నాలుగో పెద్ద పార్టీగా తాము ఉన్నామని చెప్పుకొచ్చారు.

ఆ నిర్ణయాలు వివాదాస్పదమే..కానీ ఎందుకంటే..
తాను 60 రోజుల్లో రెండు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నానని అందరూ చెబుతున్నారని..అదే విషయంలో ఇందులో రెండో కోణం ఉందని జగన్ వివరించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 20 వేల కోట్లుకు పైగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. విన్ విన్ ఫార్ములా లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ ఒప్పందాలతో డిస్కింలు అప్పుల్లో కూరుకుపోయాయని సీఎం జగన చెప్పుకొచ్చారు. వినియోగదారులు..విద్యుత్ సంస్థలు..ప్రభుత్వం ఎవరికీ నష్టం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చివరకు పరిశ్రమల మీద భారం పడుతుందని..అది తగ్గించటమే తమ ఉద్దేశ మని చెప్పారు. ఇక, పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిర్ణయం సైతం వివాదాస్పదంగా మారిందని..కానీ, కాలుష్యానికి కారణమయ్య పరిశ్రమలకు స్థలాలు కావాలంటే ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పరిశ్రమలకు కావాల్సిన విధంగా స్థానిక యువతను తీర్చి దిద్ది కంపెనీలను అందిస్తామని..దీనికి తగినట్లుగా ప్రతీ లోక్ సభ పరిధిలోనూ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అవినీతి రహిత..సమర్ధ పాలనే మా బలం..
తమ ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. మా బలహీనతలు మాకు, మీకు తెలుసు. సుదీర్ఘ తీరప్రాంతం, మంచి వనరులు మా సొంతం. మాది సుస్థిర ప్రభుత్వం.. కేంద్రం సహకారం కూడా ఉంది.ఇటీవల చట్టసభల్లోనూ చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. మీ విశ్వాసం పొందేందుకు ఈ అంశాలన్నీ చెబుతున్నా..అంటూ సీఎం జగన్ వివరించారు. మా బలహీనతలు తెలిసిన మీకు మా బలాలు కూడా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో ప్రభుత్వం నుండి ప్రతీ విషయంలోనూ సహకారం ఉంటుందని స్పష్టం చేసారు. అదే విధంగా అధికారులు అందరూ పారిశ్రామిక వేత్తలకు పూర్తి గా ఏ సమయంలో అయినా అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. 8 పోర్టులు..4 విమానాశ్రయాల ద్వారా ఏపీ లో పారిశ్రామికంగా వేగంగా ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తన నిర్ణయాల పైన ఇప్పటి వరకు ఎక్కడా బయటపడని సీఎం జగన్ ఇదే వేదిక నుండి అన్నింటికీ సమాధానం ఇచ్చారు.
-
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!











Click it and Unblock the Notifications