వైసీపీ కొత్త ఎమ్మెల్సీ అభ్యర్దులు ఖరారు - లెక్క పక్కా..!!?
ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక పై సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసారు. ప్రాంతీయ - సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దుల జాబితా ఫైనల్ అయింది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఇప్పటికే ఉపాధ్యాయ - గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి పార్టీల అభ్యర్దులు బరిలోకి దిగారు. స్థానిక సంస్థలకు సంబంధించి అధికార పార్టీలో కసరత్తు తుది దశకు చేరుకుంది. స్థానిక సంస్థలు..ఎమ్మెల్యే..గవర్నర్ కోటాలో ఖాళీ అయినా..అవ్వనున్న స్థానాలు అన్నీ దాదాపుగా వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. దీంతో..పోటీ ఎక్కువగా ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక పై సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసారు. ప్రాంతీయ - సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్దుల జాబితా ఫైనల్ అయింది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహీ ఈ జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

18 స్థానాలు - సమీకరణాలు
ఏపీ శాసనమండలి పూర్తిగా వైసీపీ వశం కానుంది. టీడీపీ హయాంలో ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్సీల కాలపరమితి దాదాపు ముగియనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన 9 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 29తో ఎమ్మెల్యేల కోటాలో మరో 7 స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 16 స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో..ఈ 16 మంది ఎంపిక కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా జూలై లో గవర్నర్ కోటాలోనూ మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల దిశగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్న వేళ.. ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాలు.. సామాజిక సమీకరణాలు..గతంలో హామీ ఇచ్చిన వారి లెక్కల ఆధారంగా కొత్త ఎమ్మెల్సీల ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటా మినహా మిగిలిన సీట్ల అభ్యర్దుల ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది.

కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికంటే..
మొత్తం 18 స్థానాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ అభ్యర్ధుల కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఇందులో బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధన్యాత ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జయమంగళం వెంకట రమణ పేరు ఖరారు చేసారు. కడప జిల్లా నుంచి రామసుబ్బారెడ్డి పేరు ఖరారు అయిందని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ, అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిశ్చల్ లో ఒకరి పేరు ఖాయం కానుంది. రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న పేరు పరిశీలనలో ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో రెండో స్థానం నుంచి వంకా రవీంద్ర లేదా గుణ్ణం నాగబాబు ఒకరికి అకవకాశం ఖాయమని తెలుస్తోంది. శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్త రామారావు పేర్లు స్థానిక సంస్థల కోటాలో ఫైనల్ చేయాల్సిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్దులు ఏకగ్రీవంగా మండలికి ఎన్నికయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఎమ్మెల్యే - గవర్నర్ కోటా రేసులో..
గవర్నర్ కోటాలో ప్రస్తుత ఎమ్మెల్సీలు ఇద్దరికీ రెన్యువల్ ఖాయంగా కనిపిస్తోంది. డొక్కా మాణిక్య వరప్రసాద్..పోతుల సునీత తిరిగి కొనసాగుతారని పార్టీ ముఖ్య నేతల సమాచారం. శ్రీకాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సుబ్రమణ్యంకు ఖాయమని తెలుస్తోంది. గన్నవరం నుంచి వల్లభేని వంశీ ఈ సారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయటం ఖాయం కావటంతో.. పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా శ్రీలక్ష్మి ..ప్రకాశం జిల్లా నుంచి జంకె వెంకటరెడ్డి పేర్ల పైన తుద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముస్లిం కోటా నుంచి గుంటూరు నుంచి జియాఉద్దీన్ పేరు వినిపిస్తున్నా.. ఇదే జిల్లా నుంచి మర్రి రాజశేఖర్.. డొక్కాకు ఖాయంగా కనిపిస్తున్న వేళ సీఎం నిర్ణయం కీలకం కానుంది, విజయవాడ లో బొప్పన భువన కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. ఈ మొత్తం ఎంపికకు సంబంధించి అధికారికంగా పార్టీ ప్రకటన చేయనుంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications