రేపు ఢిల్లీకి సీఎం జగన్ - చంద్రబాబు : ప్రధాని సమావేశాల్లో ఇద్దరూ- కానీ,.!!

ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు (శనివారం) సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి పయణం కానున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అటు సీఎం జగన్..ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఒకే సమయంలో ఢిల్లీకి వెళ్తుండటం.. ప్రధాని అధ్యక్షతన జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. అయితే, ఇద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొంటారని భావించినా... ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు సమాచారం.

Recommended Video

    "అన్నా బిడ్డకు బాగోలేదు" మహిళ వేదన... Ys Jagan ఒక్కసారిగా కాన్వాయ్ ఆపి *AndhraPradesh
    సీఎం జగన్ షెడ్యూల్ ఇలా

    సీఎం జగన్ షెడ్యూల్ ఇలా

    ముఖ్యమంత్రి జగన్ రేపు మధ్నాహ్నం గన్నవరం నుంచి బయల్దేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళ్తారు. స్పీకర్ తమ్మినేని సీతారం కుమారుడు వివాహానికి హాజరవుతారు. ఆ తరువాత విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ప్రధానితో పాటుగా అమిత్ షా.. నిర్మలా సీతారామన్..గజేంద్ర సింగ్ షెకావత్ అప్పాయింట్ మెంట్ కోరారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో..రేపు రాత్రి లేదా ఆదివారం సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 7వ తేదీన నీతి అయోగ్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఆ సమయంలో ప్రధాని మరోసారి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా ప్రధానంగా పోలవరం అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.

    పోలవరం పైనే ఈ సారి ఫోకస్

    పోలవరం పైనే ఈ సారి ఫోకస్

    ఆర్దిక అంశాల్లో కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు.. సెస్ లు- పన్నుల్లో రాష్ట్రాల వాటాల గురించి ముఖ్యమంత్రి నీతిఅయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తారని చెబుతున్నారు. ఇక, ప్రధానితో సమయం ఖరారైతే..ప్రధానంగా పోలవరం నిర్వాసితుల ప్యాకేజీ గురించి చర్చించనునున్నట్లు సమాచారం. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆజాద్ కా అమృత్ మహోత్సవం లో భాగంగా.. ఏడాది పాటు కార్యక్రమాలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. దీని పైన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కేంద్రం నుంచి టీడీపీ అధినేతకు ఆహ్వానం అందింది. దీంతో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు.

    ప్రధాని సమావేశంలో చంద్రబాబు

    ప్రధాని సమావేశంలో చంద్రబాబు

    ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు ఇద్దరూ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నా .. ఇద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. రేపు సాయంత్రం టీడీపీ అధినేత తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ.. కేంద్రంలో ఎవరూ అందుబాటులో ఉండే అవకాశం ఉండదని తెలుస్తోంది. అయితే, టీడీపీ రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ప్రకటించటం ద్వారా ఢిల్లీకి తిరిగి దగ్గరయ్యే వ్యూహాలు అమలు చేస్తుందనే వాదన వినిపిస్తోంది. దీంతో.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+