సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - ఈ నెల 15 నుంచి మొదలు..!!
ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసారు. ఎన్నికలకు ఇంకా తొమ్మది నెలల సమయం ఉందని..మంత్రులంతా కష్టపడాలని సూచించారు. జిల్లాల్లో ఎమ్మెల్యేల సమస్యలను ఇంఛార్జ్ మంత్రులు చూడాలని నిర్దేశించారు.
చంద్రబాబు పార్టీ మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత సమర్ధంగా తీసుకెళ్లాలని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఈ నెల 15 నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ మరో నిర్ణయం: ఎన్నికల కోసం ఇప్పటికే సమాయత్తం అవుతూ..పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ఎన్నికల పైన కేబినెట్ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేయాలని సూచించారు.
ప్రతిపక్ష నేత నాటి మేనిఫెస్టోలో చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయని విషయాన్ని గుర్తు చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం పైన అన్ని వర్గాల్లోనూ సానుకూలత ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కలిసికట్టుగా పని చేస్తే 2024లోనూ తిరిగి అధికారం ఖాయమని ముఖ్యమంత్రి జగన్ ధీమా వ్యక్తం చేసారు.
15వ తేదీ నుంచి సురక్షా చక్ర: ఇదే సమయంలో ఈ నెల 15వ తేదీ నుంచి సురక్షా చక్ర పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీలు..రాజకీయాలకు అతీతంగా వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేసారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికీ అవకాశం కల్పించారు.
ఇందులో భాగంగా మరో సీఎం జగన్ మరో అడుగు ముందుకేసారు. ఈ నెల 15వ తేదీ నుంచి సురక్ష చక్ర కార్యక్రమం ద్వారా గృహ సారధులు..వాలంటీర్లు నెల రోజుల పాటు ప్రతీ ఇంటికి వెళ్లి పరిశీలన చేయనున్నారు. ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారిని గుర్తించి లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టేలా కార్యాచరణ ఖరారు చేసారు.

99.5 శాతం హామీలు పూర్తి: ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కేబినెట్ లో ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాల పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ..ఉద్యోగులకు ఊరట కలిగించేలా జీపీఎస్ విధానంకు ఆమోద ముద్ర వేసారు.
దీని పైన రెండేళ్లకుగా చర్చలు చేసి..ఈ మెరుగైన విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులకు వివరించారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వీటి ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99.5 శాతం అమలు చేసినట్లుగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని వివరిస్తూ..చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.












Click it and Unblock the Notifications