సీఎం జగన్ పుట్టినరోజు: టీడీపీనేతల సరికొత్త డిమాండ్లు; సోమిరెడ్డి, అనిత ఆసక్తికర విజ్ఞప్తులు!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అభిమానులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జగన్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు తమ అభిమానాన్ని జగన్ పుట్టినరోజు సందర్భంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మొక్కలు నాటే కార్యక్రమాలు, రక్త దాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో జగన్ కు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. దేశ ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, చిరంజీవి, మహేష్ బాబు వంటి సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

జగన్ పుట్టినరోజు .. టీడీపీ నేతల డిమాండ్లు
ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు వినూత్న రీతిలో జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పుట్టినరోజు రోజైనా జగన్ మంచి పనులు చేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.మంగళవారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరిలో మద్యం దుకాణాన్ని టిడిపి అనుబంధ విభాగం తెలుగు మహిళల ఆధ్వర్యంలో ముట్టడించారు. మద్యనిషేధం హామీని అమలు చేయాలంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంచలన విజ్ఞప్తి చేశారు.

మద్య నిషేధం హామీ అమలు చెయ్యాలని కోరిన వంగలపూడి అనిత
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన దశలవారీ మద్యనిషేధం హామీ అమలు ఎక్కడ అవుతుందని ఆమె ప్రశ్నించారు. మద్యనిషేధ హామీని విస్మరించటమే కాకుండా దాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇక నాసిరకం బ్రాండ్ లు అన్ని ఏపీలోనే దొరుకుతున్నాయని మండిపడ్డారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడైనా మద్యనిషేధ హామీని అమలు చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అక్రమ సంపాదన కోసమే జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల వద్ద ఆన్లైన్ పేమెంట్ పెట్టలేదని అనిత అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు సీజన్ దృష్ట్యా తాత్కాలికంగా మద్యం ధరలు తగ్గించారని వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు.

ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి
ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ కు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారు. ఏపీలో ప్రజలందరికీ ఇసుకను ఉచితంగా ఇవ్వాలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ను కోరారు. జగన్ ప్రభుత్వం ఇసుక పాలసీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ తీసుకొచ్చిన ఇసుక విధానంతో సామాన్యులకు ఎలాంటి లబ్ది జరగటం లేదని అన్నారు.

ఇసుక ధరలపై మండిపడిన సోమిరెడ్డి
ఇసుక టన్ను నాలుగు వందల డబ్భై ఐదు రూపాయలుగా నిర్ణయించామని చెప్పారు కానీ తొమ్మిది వందల రూపాయలకు ఇసుక టన్ను అమ్ముతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మార్కాపురంలో ఇసుక టన్నుకు 12 వందల రూపాయల చొప్పున అమ్ముతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ఇరిగేషన్ శాఖ డ్రెడ్జింగ్ చేసే ఇసుకను కూడా జెపి కంపెనీకే ఎందుకు ఇస్తున్నారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పుట్టినరోజు నాడు అయినా జగన్ ఉచిత ఇసుక ఇచ్చి మంచి పని చేయాలని హితవు పలికారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications