వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ - చంద్రబాబు- పవన్ ఒకే వేదిక పైకి : మంత్రి రోజా అక్కడే : ఫేస్ టు ఫేస్..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వస్తున్నారు. వీరిద్దిరతో పాటుగా పవన్ కళ్యాణ్ సైతం అక్కడికే రాబోతున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఈ ముగ్గురు కీలక నేతలు ఇలా ఒకే వేదిక మీదకు రానుండటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ..ఈ అరుదైన కలయిక జరగబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు గవర్నర్ రాజ భవన్ వేదికగా ఎట్ హోం నిర్వహించటం ఆనవాయితీ.

రాజ్ భవన్ వేదికగా అరుదైన కలయిక

రాజ్ భవన్ వేదికగా అరుదైన కలయిక

రాష్ట్రంలో రాజకీయ -అధికార - పలు రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. వీరి గౌరవార్ధం గవర్నర్ తేనేటి విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సీఎం జగన్ ..మంత్రులతో పాటుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు.. హైకోర్టు న్యాయమూర్తులు..జనసేన అధినేత చంద్రబాబు.. శాసనమండలి ఛైర్మన్.. శాసనసభ స్పీకర్ ను ఆహ్వానించారు. అదే విధంగా ఇతర రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. శాసనసభలో తన సతీమణి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు.

సీఎం జగన్ - చంద్రబాబు - పవన్ ఒకే చోట

సీఎం జగన్ - చంద్రబాబు - పవన్ ఒకే చోట


తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో అడుగు పెడతానంటూ శపథం చేసారు. అప్పటి నుంచి సీఎం జగన్- చంద్రబాబు ఒకే వేదిక మీదకు వచ్చిన సందర్భాలు లేవు. గత వారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇద్దరూ పాల్గొనాల్సి ఉన్నా.. చంద్రబాబు హాజరు కాగా, ముఖ్యమంత్రి మరుసటి రోజున జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇద్దరూ ఈ సాయంత్రం రాజ్ భవన్ కు వస్తున్నట్లు సమాచారం. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు అవుతన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ - పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు.

జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో రోజా హాజరు

జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో రోజా హాజరు


పవన్ ఈ కార్యక్రమానికి హాజరైతే ఇద్దరూ ముఖాముఖి కలుసుకొనే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు - పవన్ సైతం కలుసుకొనే సందర్భం ఏర్పడుతుంది. ఇక, క్రిష్టా జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో రోజా సైతం ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కానున్నారు. చంద్రబాబు - పవన్ పైన నిత్యం ఫైర్ అయ్యే రోజా.. ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో మంత్రి హోదాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీరందరి కలయికకు రాజ్ భవన్ వేదిక కానుంది. దీంతో.. ఈ సాయంత్రం రాజ్ భవన లో జరిగే ఎట్ హోం పైన ఆందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది.

English summary
state top political leaders to come on to one platoform on the occassion of At home at Raj BHaan, Governor invited leaers for this event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X