వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చప్పట్లతో గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు...

|
Google Oneindia TeluguNews

జగన్ సర్కార్ తమ మేనిఫెస్టో అయిన నవరత్నాలను కుల,మత,వర్గ,రాజకీయాలకు అతీతంగా అందరికీ చేరువ చేసేందుకు తీసుకొచ్చిన గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. సంక్షేమ పథకాల్లో అవినీతి, అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా ఉద్యోగులకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని,డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేశారు. గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలంతా సాయంత్రం 7గంటలకు తమ ఇళ్ల నుంచి బయటకొచ్చి చప్పట్లతో వాలంటీర్లు,ఉద్యోగులను అభినందనించాలని సీఎం జగన్ శుక్రవారం(అక్టోబర్ 2) మధ్యాహ్నం పిలుపునిచ్చారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా గతేడాది ఇదే రోజున గ్రామ సచివాయాల వ్యవస్థను తీసుకొచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

cm jagan claps to appreciate village secretariate employees and volunteers

సీఎం పిలుపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు,పలువురు నేతలు,ప్రజలు తమ ఇళ్ల వద్ద చప్పట్లతో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత ఉద్యోగాల భర్తీ గతేడాదే పూర్తి చేసిన సంగతి తెలిసిందే. రెండో విడతలో భాగంగా 16,208 ఉద్యోగాలకు ఇటీవలే పరీక్ష నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి కీ కూడా విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థతో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తోంది.

English summary
In support of village secretariate employees and volunteers CM Jagan clapped for them infront of his camp office along with some ministers and officials on Friday evening.On the eve of village secretariat system completing one year period,CM apperciated them like this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X