పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై అధికారులకు డెడ్ లైన్ పెట్టిన జగన్ ... ఏం చెప్పారంటే

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. నేడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఇక అధికారులతో పోలవరం పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి డెడ్ లైన్ విధించారు. పనుల పురోగతితో పాటు ముంపు గ్రామాల తరలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

2021 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని జగన్ ఆదేశం

2021 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని జగన్ ఆదేశం

సీఎం హోదాలో రెండోసారి జగన్ పోలవరానికి వెళ్ళిన జగన్ పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. 2021 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఏడాది సాగునీరు అందించాలని ఆయన ఆదేశించారు. గతంలో ప్రణాళికాలోపం, సమన్వయ లోపం, సమాచార లోపం ఏర్పడింది అని పేర్కొన్న సీఎం జగన్ అధికారులకు పనులు వేగవంతం చెయ్యాలని సూచించారు. నిర్మాణ పనులపై డెడ్ లైన్ విధించారు .

Recommended Video

    AP CM YS Jagan Visited Polavarm Project And Examined The Works! | Oneindia Telugu
    జూన్‌ నాటికి స్పిల్‌వే పనులు పూర్తికావాలన్న జగన్

    జూన్‌ నాటికి స్పిల్‌వే పనులు పూర్తికావాలన్న జగన్


    ఇక జూన్‌ నాటికి స్పిల్‌వే పనులు పూర్తికావాలని సూచించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . పోలవరం ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇక పనుల పురోగతిపై అధికారులు జగన్ తో మాట్లాడారు. జూన్‌ కల్లా రైట్‌ మెయిన్‌ కెనాల్‌ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. కాపర్‌ డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలు పూర్తిచేస్తే 41.15 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు . ఇక ముంపు గ్రామాల గురించి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు అధికారులు .

    ముంపు గ్రామాల ప్రజలపై మానవత్వంతో వ్యవహరించాలన్న సీఎం

    ముంపు గ్రామాల ప్రజలపై మానవత్వంతో వ్యవహరించాలన్న సీఎం

    పోలవరం ముంపు గ్రామాల ప్రజలను 17వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు. దేవీపట్నం మండలంలోని 6 గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు చెబుతున్నారు.అయితే ముంపు గ్రామాల ప్రజల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రూపాయి ఎక్కువైనా సరే బాధితులను మానవతా కోణంలో చూసి మంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జగన్‌ సూచించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+