వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ తేల్చేసారు: చేస్తారా - కొత్తవాళ్లకు ఇవ్వాలా : స్వయంగా కార్యకర్తలతో భేటీలు..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ ఫిక్స్ చేసారు. ఎన్నికల కోసం ప్రతీ అంశంలోనూ సీరియస్ గా ఉండాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. నేతలు ఎవరైనా ఉదాసీనంగా ఉంటే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేతలకు అప్పగించిన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేసారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్లియర్ గా చెప్పాలని.. ప్రత్యామ్నామయంగా కొత్త వారికి అవకాశం ఇస్తానని జగన్ తేల్చేసారు. అదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇక కార్యకర్తలతో నేరుగా సీఎం

ఇక కార్యకర్తలతో నేరుగా సీఎం


ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. పార్టీ నేతలు ఎవరైనా పని భారం ఫీలవుతే వెంటనే చెప్పాలని సూచించారు. రీజనల్ కో ఆర్డినేటర్లు తమ కు కేటాయించిన రీజియన్ లో పది రోజులు తిరగాల్సిందేనని నిర్దేశించారు. ప్రాంతీయ సమన్వయకర్త.. జిల్లా అధ్యక్షుడు.. జిల్లాలోని ఎంపీలు..ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు అందరూ స్థానిక ప్రజా ప్రతినిధులు కలసి కట్టుగా కేడర్ ను సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసారు. ఇప్పటికే స్పష్టం చేసిన విధంగా ప్రతీ సచివాలయానికి రూ 20 లక్షలు చొప్పున నియోజకవర్గంలో 1.20 కోట్ల రూపాయాలు మంజూరు చేశామని సీఎం చెప్పుకొచ్చారు.

బాధ్యతలు నిర్వహించగరా.. లేదా

బాధ్యతలు నిర్వహించగరా.. లేదా


ప్రతీ ఇంటికి వెళ్లటం.. ప్రతీ ఒక్కరిని కలవటం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం లక్ష్యమని గుర్తు చేసారు. దీనికి ఏ ఒక్కరు అతీతం కాదని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమం చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. తాను పార్టీ పైన ఎక్కవ సమయం వెచ్చిస్తానని సీఎం సంకేతాలు ఇచ్చారు. పార్టీ సమన్వయ కర్తలు సైతం తమ బాధ్యతల విషయంలో పూర్తి స్థాయిలో పని చేయాలని నిర్దేశించారు. పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత సమన్వయకర్తలపైన ఉందన్నారు. బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ప్రజలతో మమేకం కావాల్సిందే

ప్రజలతో మమేకం కావాల్సిందే


బూత్‌ కమిటీ, గ్రామ, వార్డు కమిటీలు, పట్టణ, నగర కమిటీలు, జిల్లా కమిటీలను నిర్దేశించిన సమయంలోగా నియమించాలని స్పష్టం చేశారు. వాటితోపాటు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలన్నారు. రీతిలో పార్టీ బూత్‌ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేసారు. ఇక రానున్న రోజుల్లో సీఎం జగన్‌ విస్తృతంగా ప్రజలు, కార్యకర్తలతో ఉండాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతీ నియోజకవర్గంకు చెందిన సీనియర్ కార్యకర్తలు.. అనుబంధ సంఘాలతో వరుస సమావేశాలు ఏర్పాటు దిశగా కార్యచరణ సిద్దం అవుతోంది.

English summary
CM Jagan decided to meet party leaders from all constituencies from August 4th. CM given clear directions for party district presidents and Regional co ordinators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X