జగన్ మరో కీలక నియమాకం: ఆయన కోసం చట్టాన్ని సవరించి: ఎందుకంత ప్రాధాన్యత అంటే..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి..జగన్ కు తొలి నుండి విధేయుడిగా ఉన్న మంగ ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. దీని కోసం గత ప్రభుత్వం చేసిన చట్టంలో అవసరమైన మార్పులను చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ మీద గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆయన గెలిచినా..సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో..ఇప్పుడు ఆయనకు కీలకమైన సీఆర్డీఏ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు.

ఆర్కేకు కీలక పదవి..
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలక పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. రాజధాని వ్యవహారాలను పర్య వేక్షించే సీఆర్డీఏ బాధ్యతలను ఆర్కేకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా సీఆర్డీఏ ఛైర్మన్‌గా ఆళ్ల నున నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ నిమాయకానికి సంబంధించి చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు హయాంలో సీఆర్డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉండే విధంగా బిల్లు ను ఆమోదించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకుండా.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించాలంటే ఖచ్చితంగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అవసరమైన విధి విధానాలను పూర్తి చేసి త్వరలోనే ఆయనకు కీలకమైన ఈ నామినేటెడ్ పోస్టును అప్పగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రక్రియ ను పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

లోకేశ్‌ను ఓడిస్తే మంత్రి పదవి..
ఆళ్ల రామకృష్నారెడ్డి తాజా ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేసారు. ఆయన 2014 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుండి గెలుపొందారు. మంగళగిరి నుండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి లోకేశ్ పోటీ చేసారు. ఆళ్ల రామకృష్నారెడ్డిని మంగళగిరి నుండి గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ మంగళగిరిలో ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. ఆర్కే గెలుపు మీద అనేక అంచనాలు వినిపించాయి. లోకేశ్ మీద గెలుస్తారా లేదా అనే చర్చలు విస్తృతంగా సాగాయి. ఆర్కేకు మద్దతుగా షర్మిళ, మోహన్ బాబు వంటి వారు మంగళగిరిలో ప్రచారం చేసారు. ఎట్టకేలకు మంగళగిరి నుండి ఆర్కే గెలిచారు. అయితే, మంత్రివర్గ విస్తరణ సమయంలో తొలుత ఆర్కే పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ, గుంటూరు జిల్లాలో ఎస్సీ-బీసీ సామాజిక వర్గాలకు అవకాశంతో పాటుగా.. ఇదే జిల్లాలో జగన్ మరో హామీ పెండింగ్‌లో ఉంది. మర్రి రాజశేఖర్‌కు సైతం మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దీంతో..చివరి నిమిషంలో ఆర్కేకు మంత్రి పదవి నిలిచిపోయింది.

కోర్టుల ద్వారా చంద్రబాబును లక్ష్యంగా..
ఆర్కే వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంటూనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనేక అంశాల్లో కోర్టుల్లో కేసులు వేసి న్యాయ పోరాటం చేసారు. ఓటుకు నోటు కేసుతో పాటుగా సదావర్తి భూముల వ్యవహారం పైనా ఆర్కే న్యాయ పోరాటం చేసారు. ఆ సమయంలో సొంత నిధులు వెచ్చించాల్సి వచ్చింది. అన్ని సందర్బాల్లోనూ అధినేతకు అండగా నిలిచారు. రాజధాని భూముల వ్యవహారంలో నాటి ప్రభుత్వం భూ సమీకరణ పేరుతో భూములను స్వాధీనం చేసుకొనే క్రమంలో సుముఖంగా లేని రైతుల పక్షాన ఆర్కే నిలిచారు. దీని కోసం అనేక పోరాటాలు చేసారు. తాడేపల్లి, ఉండవల్లి,
పెనుమాక వంటి ప్రాంతాల్లో రైతులకు పవన్ కళ్యాన్ హామీలు ఇచ్చినా..వారు జనసేన వైపు మళ్లకుండా వారి కోసం పోరాటాలు చేసి ఎన్నికల సమయంలో వారి మద్దతు పొందారు. ఆర్కే సోదరుడు ఆయోధ్య రామిరెడ్డి గతం ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా..ఆయన బావ మోదుగుల వేణుగోపాల రెడ్డి తాజా ఎన్నికల్లో గుంటూరు ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో..ఆర్కేకు సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు.












Click it and Unblock the Notifications