సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - ఓట్ బ్యాంకు పెరిగేలా, మరో ఛాన్స్..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో ముందుకు వస్తుంటే..సీఎం జగన్ తన ఓట్ బ్యాంకు సుస్థిరం చేసుకొనే నిర్ణయాలు తీసుకుంటు న్నారు. తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి..తాను నమ్ముకున్న ఓట్ బ్యాంక్ ను మరింత పెంచుకొనేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందని వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త కార్యక్రమం ప్రకటించారు.
ఓట్ బ్యాంక్ పై గురి: తన సంక్షేమ పథకాలే తనకు మరోసారి అధికారం ఇస్తాయని సీఎం జగన్ నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి..ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలను అందిస్తు న్నామని ప్రతీ సభలోనూ చెబుతున్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు.

ప్రతిపక్షాలు కలిసి కట్టుగా వచ్చినా..తాను ప్రజలనే నమ్ముకున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి..ఇప్పుడు ఈ పథకాల లబ్దిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారిని గుర్తించేందుకు ఈ నెల 23వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు.
లబ్దిదారులకు మరో ఛాన్స్: జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది .ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా.. లేవా.. అన్నదానిపై ప్రతీ ఇంటికి వాలంటీర్లు వచ్చి ఆరా తీస్తారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు.
సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1న మంజూరు చేస్తారు. అదే సమయంలో పథకాల్లో లబ్దిదారులుగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లతో పాటుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతీ ఇంటికి వెళ్లేలా ఈ పథకం రూపకల్పన చేసారు.

ఇళ్ల నిర్మాణంపై టార్గెట్ ఫిక్స్: హౌసింగ్ స్కీంను సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయని వివరించారు. రూఫ్ లెవల్, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయని చెప్పారు. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలని అధికారులకు స్పష్టం చేసారు.
మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని... వాటి వేగాన్ని పెంచాలని అధికారులకు నిర్దేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.147 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించిన సీఎం... సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలన్నారు. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆప్షన్ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications