మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం నిలబెట్టుకోవటం లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. అందులో భాగంగా గతంలో ఇచ్చిన మాట మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. మూడు జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరుగుతుందని వివరించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
వరుస జిల్లాల పర్యటనలు...పెండింగ్ హామీల అమలు సీఎం జగన్ వేగవంతం చేసారు. ముఖ్యమంత్రి జగన్ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావటం..జాతికి అంకితం చేయటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తన తండ్రి మొదలు పెట్టిన ప్రాజెక్టు తాను పూర్తి చేయటం దేవుడు రాసిన స్క్రిప్ట్ గా జగన్ పేర్కొన్నారు.15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలించారు. 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
2014-19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవినట్లు జగన్ వివరించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు.












Click it and Unblock the Notifications