HBD YSJagan జన్మదినం నాడు సీఎం జగన్ కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి జగన్ తన జన్మదినం నాడు కీలక ప్రకటన చేసారు. ఈ రోజు పుట్టిన ఈ తరంలో పుట్టిన బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచన చేసానన్నారు. వచ్చే తరం పిల్లల కోసం మంచి మేనమామగా బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వ పాఠశాలల్లో డిటిటల్‌ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రకిటించారు. ఇప్పటీకే ఈ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు.

విద్యార్ధులకు ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందన్నారు.

పెత్తందార్ల భావాలను బద్ధలు కొడుతూ..

ఇదే సభలో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తరాలు మారుతున్నా కూడా కొన్ని వర్గాల తలరాతలు మారకూడదన్న పెత్తందార్ల భావాలను బద్ధలు కొడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం రాకూడదు. చదవకూడదంటూ మెరుగైన చదువులు రాకూడదని పెత్తందారి భావాలను చూసి బాధపడ్డానని చెప్పుకొచ్చారు.

ఈ మూడున్నరేళ్ల పాలనలో ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ఈ రోజు రాష్ట్రంలో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఆ పిల్లలకు మంచి మేనమామగా, ఆ తల్లులకు అన్నయ్యగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని ప్రకటించారు.

ప్రతి వర్గం- ప్రతి కులం నష్టపోతుంది

ఆర్థిక సమానత్వం లేకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా..అందించే చదువుల్లో సమానత్వం తీసుకురాలేకపోతే ప్రతి వర్గం, ప్రతి కులం నష్టపోతుందని ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఇంగ్లీష్‌ చదువులు కూడా పరిగణలోకి తీసుకుంటే మంచి చదువులు మన పిల్లలకు ఉండటం వారి తలరాతలు మారుస్తాయని చెప్పారు. మన సమాజంలోనే కొందరు ఎప్పటికీ ఎందుకు పోటీ పడలేకపోతున్నారని గమనిస్తే..వాళ్ల బతుకులు ఇలా ఎందుకు ఉన్నాయని ఆలోచించానన్నారు.

ఈ వర్గాల పసి పిల్లల తలరాతలు, వారి ప్రయాణాన్ని మార్చలేమా అన్నది తన మనసులో ఉన్న ప్రశ్నగా పేర్కొన్నారు. ఈ క్లాస్‌ అంతరాలు ఇలాగే కొనసాగాలా అన్నది అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పలకల చదువులతోనే కొన్ని కులాల విద్యాభ్యాసం ముగిసిపోయిందన్నారు. కొన్ని వర్గాలకు మాత్రమే ట్యాబ్‌లు, డిజిటల్‌ చదువులు అన్నది మనం ఆమోదించవచ్చా అనేది ఆలోచించాలని సూచించారు.

తోడుగా నిలుస్తా - నాదీ బాధ్యత

ప్రతీ కుటుంబంలో ప్రతీ పిల్ల - పిల్లవాడు చడువుకోవాలని సీఎం జగన్ సూచించారు. ప్రతీ పేదవాడు చదువుకు ఎంత ఖర్చు అయినా తాడు అండగా ఉంటానిని హామీ ఇచ్చారు. పిల్లలను ఖచ్చితంగా బడికి పంపాలని పిలుపునిచ్చారు. వచ్చే తరం పిల్లల కోసం మంచి మేనమామగా, మంచి అన్నగా బాధ్యత తీసుకున్నానని వివరించారు.

రూ.686 కోట్ల వ్యయంతో అక్షరాల 5,18, 740 ట్యాబ్‌లను ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదువుతున్న పేద పిల్లలకు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే తరహాలో ప్రతీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో దీనిని కొనసాగించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+