YS Jagan: మానవత్వం చాటుకున్న జగన్.. సీఎం హామీ గంటలో పరిష్కారం

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. భీమవరం పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఇచ్చిన హామీని గంటలోనే పరిష్కారం చూపారు. తొమ్మిది మంది అర్జిదారులకు తొమ్మది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జిదారులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను కలెక్టర్ ప్రశాంతి అందజేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం భీమవరం పరిరక్షణ సందర్భంగా పలువురులతో సమస్యలను వినడంతో పాటు తక్షణం వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతిని ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి తో కలిసి అందజేశారు కలెక్టర్.

cm jagan financial help to 9 poor families in his bhimavaram visit

ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆమేరకు సీఎంను కలిసిన 9 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రూ.9 లక్షల ను అందజేయడం జరిగిందని తెలిపారు.

చెక్కులు అందుకున్న వారి వివరాలు:

కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా. భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు.

ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా. భర్త చనిపోయారు. వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది

చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా, బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం అందజేశారు.

కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.

తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా. భర్త మరణించడంతో ఆర్థిక సహాయం.

అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం.

అందుగుల లాజర్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం.

గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం.

కోరాడ వీర వెంకట సత్యనారాయణ, పొలసానపల్లి గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+