జగన్ సంచలన నిర్ణయం..టీడీపీ నేతకు కీలక బాధ్యతలు
సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఓ పక్కా నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోవైపు సిద్ధం పేరిట పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమయాత్తం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ సీఎం జగన్ మొండిగానే ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతుంది.
మంత్రి జోగి రమేష్‌తో విభేదాల కారణంగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనుండటంతో ఆయన స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావు పేరును వైసీపీ అధిష్టానం ఖారారు చేసింది. అయితే స్వర్ణాల తిరుమలరావు అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే విమర్శలు తలెత్తడంతో మైలవరం నియోజకవర్గం అభ్యర్థి విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారు.

మారుతున్న రాజకీయ పరిణామాలతో దృష్ట్యా సీఎం జగన్ మైలవరం నియోజకవర్గంపై కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతుంది. మైలవరం అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే , నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారు. సోమవారం జగన్‌ను సీఎం క్యాంపు కార్యలయంలో కలిశారాయన. దీంతో ముద్దరబోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖారారైంది.
నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో చర్చించిన తరువాతే ముద్దరబోయిన వెంకటేశ్వరరావును వైసీపీలోకి ఆహ్వానించడం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా సీఎం జగన్ సూచన మేరకు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మైలవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలని చూస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications