తెలుగు బూతుల పార్టీ - రౌడీ సేన : చంద్రబాబు భయంతోనే - ఇదేం ఖర్మరా బాబు : సీఎం జగన్ ఫైర్..!!
ముఖ్యమంత్రి జగన్ నర్సాపురం వేదికగా చంద్రబాబు - పవన్ కల్యాణ్ పైన విరుచుకుపడ్డారు. నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీ..ఫిషింగ్ హార్బర్ తో పాటుగా దాదాపు రూ 3,300 కోట్ల మేర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. నర్సాపురంతో పాటుగా రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని ముఖ్యమంత్రి వివరించారు. చంద్రబాబు 40 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. గత పాలకులు ఊహకు కూడా అందని విధంగా..ఈ వర్గాలకు అండగా తోడుగా నిలబడగలిగాని సీఎం చెప్పుకొచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురంలో రూ.3,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.#CMYSJagan #Narasapuram pic.twitter.com/t7xp33Lldv
— YSR Congress Party (@YSRCParty) November 21, 2022
బైబై చంద్రబాబు భయంతోనే
చంద్రబాబు..దత్తపుత్రుడు గత పాలనలో ఏం చేసామో ప్రజలకు చెప్పుకోలేక నోటికి పని చెబుతున్నారంటూ మండిపడ్డారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా...దత్తపుత్రుడి పార్టీ రౌడీసేనగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోవటంతోనే 2019 ఎన్నికలలో దత్త పుత్రుడు - సొంత పుత్రుడుని ఓడకొట్టి బైబై చెప్పారన్నారు. ప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించారని గుర్తు చేసారు. చంద్రబాబు ఇదే ఖర్మరా బాబు అని తల పట్టుకొని కూర్చున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సొంత పుత్రుడు - దత్త పుత్రుడు కూడా చంద్రబాబుతో ఇదేం ఖర్మరా బాబు అంటున్నారని ముఖ్యమంత్రి వ్యగంగా వ్యాఖ్యానించారు.
బాబు ప్రతి మాటలో నిరాశ, నిస్పృహ.. కుప్పంలో కూడా తాను ఎమ్మెల్యేగా గెలవలేనన్న భయం కనిపిస్తోంది. #CMYSJagan #Narasapuram #GoodByeBabu pic.twitter.com/JHpJFUON8d
— YSR Congress Party (@YSRCParty) November 21, 2022

అధికార భగ్న ప్రేమికుడు చంద్రబాబు
1995లో ఎన్టీఆర్ కూడా తన ఇంట్లో పార్టీలో కేబినెట్ లో చంద్రబాబుకు స్థానం ఇచ్చినందుకు ఇదే ఖర్మరా బాబు అనుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి నేతలు మన రాజకీయాల్లో ఉన్నందుకు ప్రజలంతా ఇదేం కర్మరా బాటు అనుకుంటున్నారని..తాజాగా టీడీపీ ప్రారంభించిన ఇదే ఖర్మరా బాబు నిరసన కార్యక్రమం గురించి సీఎం జగన్ సెటైర్లు వేసారు. గెలిపిస్తే సరే...లేకుంటే అవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు బెదిరిస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. నిరాశ - నైరాశ్యం తో అధికార భగ్న ప్రేమికుడు చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కొందరు
సెల్ ఫోన్ టవర్ నుంచి దూకేస్తామంటారు.. రైలు కింద తల పెట్టేస్తామంటారని..ఆ తరహాలో ఇప్పుడు చంద్రబాబు తయారయ్యారని చెప్పుకొచ్చారు.
బాబు రాజకీయాల్లో ఉండడం చూసి ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. #GoodByeBabu #CMYSJagan pic.twitter.com/Jaet7OsTq0
— YSR Congress Party (@YSRCParty) November 21, 2022
మంచి జరిగిందంటేనే తోడుగా నిలవండి
అధికారంలో ఉన్న సమయంలో ఏ మంచి చేసారని ఓటు వేయాలని కోరుతారని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రశ్నిస్తామని చెప్పిన వారు ప్రశ్నించరన్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. చంద్రబాబు- దత్తపుత్రుడిని నమ్మద్దని..వారికి మద్దతుగా నిలుస్తున్న మీడియాను నమ్మవద్దని ముఖ్యమంత్రి కోరారు. ఈ మూడున్నారేళ్ల కాలంలో లక్షా 75 వేల లబ్ది చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. మూడున్నారేళ్ల కాలంలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తున్నామని చెప్పారు. విద్య - వైద్యం - ఇళ్ల నిర్మాణాలు - సామాజిక న్యాయం - మహిళా సాధికారత - పారదర్శకత- వికేంద్రీకరణ లక్ష్యాలతో అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications