జగన్ రెడ్డి మూర్ఖపు ముఖ్యమంత్రి -ఎయిడెడ్ కళాశాలల భూములపై కన్నేశారు : లోకేశ్ ఫైర్..!!
జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్రమే ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎయిడెడ్ వ్యవస్థను ప్రయివేటు పరం చేయటానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతలో విద్యార్ధులతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్ ఎయిడెడ్ కళాశాలల భూములపై జగన్ కన్నేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ను మూర్ఖపు ముక్యమంత్రి..మంత్రులు కంత్రీలు అంటూ లోకేశ్ తీవ్రంగా స్పందించారు. జగన్ రెడ్డి బ్లడ్ లో డేవలప్మెంట్ లేదు మొత్తం డిస్ట్రక్షనేనని విమర్శించారు.

ఆ ఘనత చంద్రబాబుదే
నెలలో మొదటి తేదీన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. మేనమామగా ఉంటానన్న జగన్ రెడ్డి కంసమామగా మారిపోయారంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు. ..అధికారంలోకి వచ్చాకా పిడి గుద్దులు తప్పటం లేదన్నారు. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేయించే స్థాయికి జగన్ రెడ్డి దిగజారిపోయారని విమర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అపి ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

మాట తప్పారు..మడమ తిప్పారు
ఇద్దరు పిల్లలు ఉన్నా అమ్మ ఒడి అన్న వాడు మాట మార్చాడు, మడమ తిప్పారంటూ విమర్శించారు. ఎయిడ్ సంస్థల ఆస్తులపై కన్ను వేశారని... ఆస్తులు కొట్టేసేందుకు వైసీపీ గెద్దలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. విద్యార్థులపై పోలీసులు చేసిన దాడికి సీఎం విద్యార్థిలోకానికి క్షమాపణ చెప్పాలని..బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేసారు. నిన్న మొన్నటి వరకు ప్రశ్నించిన ప్రజలు, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. ఈ రోజు విద్యార్ధులపై జరిగినవి కూడా స్టేట్ స్పాన్సర్డ్ దాడులేనంటూ వ్యాఖ్యానించారు.

మూల్యం చెల్లించుకోక తప్పదు
విద్యార్ధులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బకి జగన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ రద్దుకు వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు జగన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపడుతూ నిరసనలు తెలియజేస్తున్నారని..ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్ల మీదకు వస్తున్నారంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత దుర్మార్గమైనదో అర్ధంమౌతుందని వ్యాఖ్యానించారు. ఎంత సేపూ ప్రశ్నించే వారిని ఎలా అణిచివేయాలో చూడటమే కానీ, సమస్య ఎలా పరిష్కరించాలో ఆలోచన చేయరా సీఎం అంటూ ప్రశ్నించారు.

నిర్ణయం రద్దు చేసుకోవాల్సిందే
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం విద్యార్దులకు మద్దతు ప్రకటించారు. అమ్మాయిలను కూడా కొట్టారని.. సీఎం ఈ ఘటన ని ఖండించాలన్నారు. పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. పోలీసుల ద్వారా ఎక్కువ కాలం రాజ్యమేలలేరని చెప్పుకొచ్చారు. పోలీసులు కాలేజ్ లోకి వస్తే యాజమాన్యం ఎం చేస్తుందని ప్రశ్నించారు. ఎయిడెడ్ జిఓ ఉపసంహరించుకోవాలని... ఎయిడ్ కొనసాగించే వరకూ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications