సీజేఐకు నేడు సీఎం జగన్ విందు - నేడే డాక్టరేట్ ప్రధానం..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేడు విజయవాడలో బిజీబిజీగా గడపనున్నారు. సీజేఐ విజయవాడలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలను సీఎం జగన్ తో కలిసి ప్రారంభిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇదే కోర్టు నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తన న్యాయవాద జీవితం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేసారు. ఇప్పుడు సీజేఐ హోదాలో ఆ భవనాలను ప్రారంభించనున్నారు.

నేడు సీజేఐకు డాక్టరేట్ ప్రధానం
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయవాడ వచ్చిన సమయంలో ఈ భవనాల నిర్మాణాల గురించి సీజేఐ ప్రస్తావించారు. ఆ తరువాత ఆయన న్యాయవిద్య అభ్యసించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంటారు. విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాల్లో భాగంగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణకు ఈ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తమ విద్యాసంస్థలో చదివి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి పీఠంపై కూర్చున్న రమణకు యూనివర్శిటీ తరపున ఘన స్వాగతం పలుకుతున్నారు.

సీఎం జగన్ అధికారిక విందు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లా కోర్సు ప్రథమ బ్యాచ్ విద్యార్థి ఆయన. యూనివర్సిటీ విద్యార్దిగా లా అభ్యసించి..ఇప్పుడు సీజేఐ హోదాలో అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోనున్నారు. సీజేఐ హోదాలో స్వరాష్ట్రానికి వచ్చిన సీజేఐ గౌరవార్ధం ఏపీ ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఈ విందును నిర్వహిస్తున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు హాజరు కానున్నారు. గతంలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా విజయవాడకు వచ్చిన సమయంలో సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు.

న్యాయ విద్య చదవిన చోటే..సీజేఐ హోదాలో
రాజ్ భవన్ లో గవర్నర్ సైతం అదే సమయంలో సీజేఐ గౌరవార్ధం ప్రత్యేకంగా గెట్ టు గెదర్ నిర్వహించారు. ఆ సమయంలో బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్న సీజేఐ.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ రోజున మరోసారి సీజేఐ హోదాలో అదే యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. దీంతో.. అటు ప్రభుత్వం.. ఇటు యూనివర్సిటీ సీజేఐకు గౌరవంగా స్వాగతం పలికేందుకు..సత్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడలో కార్యక్రమాలు పూర్తయిన తరువాత సీజేఐ గుంటూరు కు వెళ్లనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ కు పయనమవుతారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications