వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్వేలులో రూ.400 కోట్ల‌ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన సీఎం జగన్ , కడప జిల్లాకు వరాల జల్లు !!

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బద్వేలు నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సొంత జిల్లాలో జగన్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ రాష్ట్రంలోనే వెనుకబాటు లో ఉన్న నియోజకవర్గం బద్వేల్ అని, గత పాలకులు బద్వేలు నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఈ సందర్భంగా మాట్లాడారు. బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బ్రహ్మ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్ళు ఎప్పుడు నిండు కుండలా ఉండాలని పేర్కొన్న జగన్ కుందూ నది పై లిఫ్ట్ ద్వారా బ్రహ్మ సాగర్ కు నీళ్లు అందిస్తామని వెల్లడించారు.

 CM Jagan in Kadapa district .. Rs 400 Crores worth development works in Badvelu

36 కోట్ల రూపాయలతో బ్రహ్మ సాగర్ ఎడమ కాలువ లో ఎత్తిపోతలకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 80 కోట్ల రూపాయలతో లోయర్ సగిలేరు కాలువల విస్తరణ పనులు చేపడుతున్నామని బ్రాహ్మణ పల్లి వద్ద సగిలేరు పై 9.5 కోట్ల రూపాయలతో మరో వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ వెల్లడించారు 7.5 కోట్ల రూపాయలతో గోదాముల నిర్మాణం తో పాటుగా, బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇక బద్వేలులో కూరగాయల, చేపల మార్కెట్ లతో పాటుగా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తామన్నారు.

Recommended Video

Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu

మధ్యాహ్నం ఎర్రముక్కపల్లి లోని సి.పి.బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ కి వెళ్లి సి.పి.బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. అలాగే సి.పి.బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆపై జిల్లా కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.

English summary
AP CM YS Jagan Mohan Reddy is touring Kadapa district for the second day. As part of this, he laid the foundation stone for several development works in Badvelu constituency today. Speaking at a public meeting after laying the foundation stone for the Rs 400 crore development projects in Badvelu constituency, CM Jagan said that Badvelu had not seen development due to the negligence of the previous rulers and now Badvelu would be developing in all forms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X