పవన్ కళ్యాణ్ కు సీఎం జగన్ ఎంత మేలు చేస్తున్నారంటే!!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ నియోజక వర్గాల ఇంచార్జ్ లను మారుస్తూ తీసుకుంటున్న నిర్ణయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ టికెట్ నో అని చెప్పటంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీల వంక చూస్తున్నారు.
ముందుగా టీడీపీ వంక చూస్తున్న వారు, టీడీపీలోకి వెళ్ళే వీలు లేకుంటే జనసేన వంక చూస్తున్నారు. ఇది ఈ ఎన్నికలో జనసేనకు కాస్త ఉత్సాహం ఇస్తున్న విషయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో దారుణ ఓటమి పాలై కేవలం ఒక్క స్థానానికి పరిమితం అయినప్పటికీ రాజకీయాలను విడిచిపెట్టలేదు. ప్రజల కోసం ప్రభుత్వం పై తనదైన శైలిలో పోరాటం చేస్తూనే ఉన్నారు.

గత ఎన్నికల్లో జనసేన నుండి బరిలో దిగిన నాయకులలో చాలా మందికి ప్రజా క్షేత్రంలో గుర్తింపు లేకపోవటం వలన వారు ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు. జనసేన పార్టీలో ప్రధాన లేమి సరైన నాయకులు లేకపోవటం. ఇప్పుడు వైసీపీలో జగన్ తీరుతో అసహనానికి గురవుతున్న నాయకులలో చాలా మంది జనసేన వంక చూస్తున్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు జనసేన వంక చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఇంకా తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా పవన్ కళ్యాణ్ ను కలిసి గంట పాటు మంతనాలు జరిపారు. తాజాగా వైఎస్ జగన్ వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్ ల రెండో జాబితా ప్రకటించటంతో అందులో టికెట్లు రానివారు టీడీపీలో వెసులుబాటు లేనివాళ్ళు, జనసేన తీర్ధం పుచ్చుకోవాలని ఆలోచిస్తున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా ఉన్నా ఆయన పార్టీలోకి చేరికల వైపు మొగ్గు చూపిన నాయకులు చాలా తక్కువ. గతంలో జేడీ లక్ష్మీ నారాయణ వంటివారు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరినా ఆ తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఇక ఈ ఎన్నికల సమయంలో జగన్ చేస్తున్న సాయంతో పవన్ పంట పండుతుంది. పార్టీలో చేరేందుకు టికెట్ ఆశావహులు క్యూ కడుతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications