• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం: నాలుగో స్థానంలో జగన్‌: ఇండియా టుడే పోల్‌ సర్వేలో..!

|

మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట ఇండియా టుడే పోల్‌ సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నాలుగో స్థానంలో నిలిచారు. బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం గా జాతీయ స్థాయిలో జగన్ కు నాలుగో స్థానం దక్కింది. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ..అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు లభించిందని సర్వేలో తేల్చారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. జాతీయ స్థాయిలోనూ చర్చకు కారణమయ్యాయి. తాజాగా మూడు రాజధానుల దిశగా మఖ్యమంత్రి అడుగుల పైన జాతీయ పత్రికల్లో వ్యతిరేక కధనాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇండియా టూడే నిర్వహించిన ఈ సర్వేలో జగన్ నాలుగో స్థానంలో నిలవటం వైసీపీ నేతలకు కొత్త జోష్ ను తెస్తోంది. వ్యతిరేక ప్రచారం సాగుతున్న ఈ సమయంలో ఈ పోల్ సర్వే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం గా నాలుగో స్థానం..

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం గా నాలుగో స్థానం..

ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో వైఎస్‌ జగన్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రుల పని తీరు మీద ఈ సంస్థ పోల్ సర్వే నిర్వహించింది. అందులో ఏపి నుండి స్పందన వ్యక్తం అయింది. అందులో భాగంగా వచ్చిన ఓట్ల ఆధారంగా సంస్థ ఫలితాలను ప్రకటించింది. అందులో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఏఏపీ), పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), మూడో స్థానంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నిలిచారు. ఆ తరువాత ఏపీ సీఎం జగన్ కు స్థానం దక్కింది.

 ఏడు నెలల పాలనలో..

ఏడు నెలల పాలనలో..

గత ఏడాది మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన పలు పధకాలను తొలి ఆరు నెలల్లోనే అమలు ప్రారంభించారు. ఒక వైపు వివాదాలు..మరో వైపు పధకాల అమలు కొనసాగించారు. ఇక,జగన్‌ తర్వాత బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంల జాబితాలో అయిదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, ఆరో స్థానంలో గుజరాత్‌ సీఎం విజయ్‌రూపాని, ఏడో స్థానంలో రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు నిలిచారు. ఈ బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్‌ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్‌ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్‌ఫార్మెన్స్‌ ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చినట్లుగా స్పష్టం చేసారు.

వైసీపీ రిలీఫ్ గా తాజా సర్వే..

వైసీపీ రిలీఫ్ గా తాజా సర్వే..

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం పైన అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా మార్చుకొని విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే విధంగా జగన్ సీఎం అయిన తరువాత తీసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల సమీక్ష నిర్ణయం..పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు..ఇంగ్లీషు మీడియం స్కూళ్లు.. ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం పైన జాతీయ స్థాయిలోనూ చర్చ సాగింది. అనేక జాతీయ దిన పత్రికల్లో వ్యతిరేక కధనాలు కనిపించాయి. దీని ద్వారా వైసీపీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొని ఉంది. అయితే, తాజాగా ఇండియా టూడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట నిర్వహించిన సర్వేలో బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంగా జగన్ కు నాలుగో స్థానం దక్కటంతో..ఇప్పుడు వైసీపీ ఈ అంశాన్ని తమ అనకూల ప్రచారాస్త్రంగా మలచుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
CM Jagan is in fourth place as best performing CM contest counducted by India today by name mood of the nation. it gives big relief for yCp cadre in present political situation in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more