ప్రధాని మోదీకి సీఎం జగన్ - పవన్ కల్యాణ్ ట్వీట్లు..!!
ప్రధాని మోదీ జన్మదినం ఈ రోజు. పలువురు ప్రముఖులు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, జనసేనాని పవన్ తో సహా పలువురు సోషల్ మీడియా ఖాతాల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అటు ప్రధాని మోదీ జన్మదనం నాడు వేలాది కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం 13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకానికి శ్రీకారం చుట్టారు.
My greetings and wishes to Honourable Prime Minister @narendramodi garu on his 73rd birthday.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2023
ప్రధాని మోదీ ఈ రోజు 73వ జన్మదినం జరపుకుంటున్నారు, ఏపీ ముఖ్యమంతరి జగన్ ప్రధానికి జన్మదినం వేళ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసారు. జనసేనాని పవన్ కల్యాణ్ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తన పాలనలో అత్యంత శక్తివంతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెడుతున్న గౌరవ భారత ప్రధాని మోదీకి జనసేన తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి సైతం ప్రధానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసారు. మోదీకి ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలని ఇంకా ఎంతో కాలం దేశ సేవలో ఉండాలని ఆకాక్షించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజున వేలాది కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం 13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకానికి శ్రీకారం చుట్టారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి సెక్టార్ 25 వరకు పొడగించిన ఢిల్లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మెట్రో ఉద్యోగులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోడీ మెట్రోలో ప్రయాణించారు. ప్రధాని మోడీ వారితో సరదాగా మాట్లాడారు. ప్రధాని మోడీతో పిల్లలు, ప్రయాణికులు సెల్ఫీలు దిగారు. ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న క్రమంలో ఓ యువతి ప్రధాని నరేంద్ర మోదీకి 73వ పుట్టినరోజు సందర్భంగా సంస్కృత భాషలో శుభాకాంక్షలు తెలిపింది.
భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తన పాలనలో అత్యంత శక్తివంతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెడుతున్న గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారికి @JanaSenaParty తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.@BJP4India @PMOIndia#HappyBirthdayModiJi #HappyBdayModiJi pic.twitter.com/VBycZH7Lte
— JanaSena Party (@JanaSenaParty) September 17, 2023
విశ్వకర్మ జయంతి సందర్భంగా ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో 'పిఎం విశ్వకర్మ' అనే కొత్త స్కీమ్‌ను ప్రారంభించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేతి వృత్తి కళాకారులతో ముచ్చటించారు మోదీ. వాళ్ల బాగోగులను, ఉపాధి, పని గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఢిల్లీలో 73 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ యశోభూమిని ప్రధాని మోదీ ప్రారంభించి జాతీకి అంకితం చేశారు. ద్వారకాలో యశోభూమి సమావేశ మందిరాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. ప్రపంచంలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇదే.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications