వాటిని పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తాం -సీఎం జగన్ ప్రకటన : ముందస్తుకు సమాధానం..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. ఏపీలో ముందస్తు ఎన్నికల పైన చర్చ జరుగుతున్న వేళ..సీఎం వాటికి పరోక్షంగా సమాధానం చెప్పారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిచారు. వైఎస్సార్.. బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. నాడు వైఎస్సార్ ప్రారంభించిన సంక్షేమ పనులను ఆయన కుమారుడిగా.. మరో నాలుగు అడుగులు ముందుకేసి అమలు చేస్తున్నామని జగన్ వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇప్పటికే పూర్తి చేసామని చెప్పారు.

గ్రానైట్ పరిశ్రమకు సీఎం వరాలు
కొంత మంది మహా నేతలకు శారీరంగా మరణం ఉంటుంది కానీ, వారు చేసిన మంచి పనులు మాత్రం ఎఫ్పిటీ శాశ్వతమని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని కీలక అంశాల పైన జగన్ క్లారీ ఇచ్చారు. ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏప్రిల్ 14న విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
అదే విధంగా గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి గతంలో ఉన్న విధంగా శ్లాబ్ విధానం గతంలో హామీ ఇచ్చిన విధంగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చామన్నారు. దీని కారణంగా గ్రానైట్ వ్యాపారం చేస్తన్న చిన్న వ్యాపారవేత్తలకు.. ఆ పరిశ్రమ పైన ఆధారపడిన వారికి మేలు జరుగుతుందని చెప్పారు.

వలిగొండ పూర్తి చేసే ఎన్నికలకు
ఇక.. గ్రానైట్ పరిశ్రకు సంబంధించి విద్యుత్ ఛార్జీల్లో మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న మొత్తంలో రెండు రూపాయాల మేర తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు పైన కీలక ప్రకటన చేసారు.
వెలుగొండ ప్రాజెక్టును వైఎస్సార్ హాయంలో పరుగులు పెట్టిస్తే..చంద్రబాబు హాయంలో నిర్లక్ష్యం చేసారంటూ నిర్మాణ వివరాలను విశ్లేషించారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రాజెక్టు మొదటి టన్నెల్ లో మిగిలిన 2.9 కిలో మీటర్లు పూర్తి చేసామని.. రెండో టన్నెల్ లో మిగిలిన 3.96 కిలీ మీటర్లను పూర్తి చేసి..వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రాజెక్టును ప్రారంభించి.. జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ముందస్తు పై క్లారిటీ ఇచ్చినట్లేనా
దీని ద్వారా ఏపీలో వచ్చే సెప్టెంబర్ తరువాతనే ఎన్నికలు ఉంటాయనే విషయాన్ని జగన్ స్పష్టం చేసారు. దాదాపుగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 2024 మొదటి త్రైమాసికంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి 2023 చివరి వరకు వరుసగా చేయాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ను ఇప్పటికే సిద్దం చేసారు.
దాదాపు రెండేళ్లు కరోనా కారణంగా పాలన పైన ప్రభావం పడింది. దీని కారణంగా పాలనా పరంగా చేయాల్సినవి చాలా ఉన్నాయనే చర్చ వినిపిస్తోంది. గతంలో పార్టీ ముఖ్యనేతలు సైతం ముందస్తు అవకాశం లేదని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఆలోచనలకు దాదాపుగా ముగింపు పలికారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications