జగన్ ఆద్బుతంగా ఆడగలిగే గేమ్ ఒక్కటే : కొడాలి నాని..!!

టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేష్ తో పాటుగా జనసేనాని పవన్ కళ్యాణ్ పైన మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. లోకేష్ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన ఫైర్ అయ్యారు. వైయస్‌ జగన్‌కు వచ్చిన గేమ్‌..పొలిటికల్‌ ఫుట్‌బాల్‌..ఒకే ఒక షాట్‌..10 బాళ్లు ఒకేసారి గోల్స్‌లో పడుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని, సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చ జరుగకుండా ప్రతిపక్షం అడ్డుపడుతుందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ అయ్యిందని ఫైర్ అయ్యారు.

సీఎం వైయస్‌ జగన్‌ పులి కాబట్టే మంగళగిరిలో లోకేశ్ ఆహారం అయ్యారంటూ వ్యాఖ్యానించారు. లోకేష్‌ పనికిరారనేచంద్రబాబు పక్క పార్టీపై ఆధారపడ్డారన్నారు. పనికి మాలిన పార్టీలు టీడీపీకి మద్దతు తెలుపుతున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బీజేపీ అధ్యక్షడిగా ఉన్న అమిత్ షా కుటుబంతో కలిసి తిరుపతికి వస్తే ఆయన కాన్వాయ్ పైన రాళ్లు ..చెప్పులతో దాడి చేయించారని కొడాలి నాని ఆరోపించారు. ప్రధాని గన్నవరం ఎయిర్‌ పోర్టులో దిగితే నల్లబెలూన్లు ఎగుర వేయించారని చెప్పుకొచ్చారు.

CM Jagan knows only football game, Chandrababu playing games with adopted son-Kodali Nani

ముద్రగడ్డపద్మనాభం నిరాహారదీక్ష చేస్తుంటే ఇష్టం వచ్చినట్లు కొట్టించారని చెప్పారు. పవన్ కళ్యాణ్ విశాఖలో ర్యాలీ చేస్తే తాము అడ్డకోలేదన్నారు. జనవాహిని కార్యక్రమం పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారని వివరించారు. విజయవాడ నోవాటెల్ నుంచి మంగళగిరికి పవన్ తిరిగితే తాము అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర వేళ గుడివాడలో తొడలు కొట్టి రెచ్చగొడితే తాము ఏమీ స్పందించలేదన్నారు. హైకోర్టు ఆదేశాలతో వచ్చారు.. ప్రభుత్వంలో ఉన్నామనే కారణంగా తాము మౌనంగా ఉండిపోయామని చెప్పుకొచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేయటంతో నే 23 సీట్లకి టీడీపీ పడిపోయిందని ఎద్దేవా చేసారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో చర్చ జరుగకూడదని తప్పుడు ఆరోపణలు, తప్పుడు పనులు చేస్తూ బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. మేధావులని పనికిమాలిన వ్యక్తులను పెట్టుకొని డిబెట్లు పెట్టించి జగన్‌ను తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌ ఆడే ఫుట్‌బాల్‌ గేమ్‌లో వీరందరూ బలి కాకతప్పదని హెచ్చరించారు .రాహుల్‌ గాంధీ అనే వ్యక్తి ఉన్నాడని రాష్ట్రంలో ఎవరికి తెలియదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+