వైఎస్సార్ ఆసరా రెండో విడత ప్రారంభం-జనాదరణ మరువలేను- జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుస ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన ఓటర్లకు ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విపక్ష టీడీపీ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు 'వైఎస్సార్ ఆసరా' రెండో విడత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎఁ వైఎస్ జగన్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 'వైఎస్సార్ ఆసరా' రెండో విడత కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరి బాధలు చూశానన్నారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పారు.
వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. . నాలుగు విడతల్లో రూ.25,517 కోట్లు జమ చేస్తామన్నారు.. ఎన్నికల కోడ్ దృష్ట్యా వైఎస్సార్ జిల్లాలో నవంబర్ 6 నుంచి 15 వరకు ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. దేవి నవరాత్రుల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. డ్వాక్రా మహిళలను మోసం చేశారని, . చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని సీఎం జగన్ అన్నారు. 'బాబు హయాంలో పొదుపు సంఘాలు నిర్వీర్యమైపోయాయని, చంద్రబాబు హయాలో 'సున్నావడ్డీ' పథకం కూడా రద్దు చేశారని జగన్ అన్నారు..

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా సంఘాలు నిలబడగలిగాయని, పంచాయతీ నుంచి పరిషత్ ఎన్నికల వరకు ప్రజా ఆదరణ మరువలేం' అని సీఎం జగన్ అన్నారు.సున్నా వడ్డీ పథకం ద్వారా 95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని, మహిళలకు సాంకేతికత, బ్యాంకింగ్ రంగాల్లో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించాని జగన్ తెలిపారు. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.
ప్రభుత్వ చొరవతో 3 లక్షలకుపైగా మహిళలు వివిధ వ్యాపారాలు ప్రారంభించారు. నెలకు రూ.7వేల నుంచి రూ.10వేలకుపైగా అదనపు ఆదాయం పొందుతున్నారు. హోంమంత్రిగా తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చాం. జగనన్న కాలనీల ద్వారా 1.25 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో 67.47 శాతం పదవులు మహిళలకు కేటాయించాం. రాష్ట్రంలో రూ.1450 కోట్లు ఖర్చుచేసి 61 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని సీఎం జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications