ఎన్నికల వేళ, ఏపీలో కీలక పరిణామం - ఫలిస్తున్న సీఎం వ్యూహాలు..!!

ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ మరోసారి అధికారం దక్కటం ఖాయమనే ధీమాతో ఉన్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ టార్గెట్ గా విపక్షాలు ఏకం అవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తేనే తిరిగి పెట్టబడులు..అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు జగన్ సంక్షేమ బాటలోనే ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయం లో ఏపీలో వరుస పెట్టుబడులు ఎన్నికల వేళ సీఎం జగన్ కు కలిసి వస్తున్నాయి.

రూ.1425 కోట్ల పెట్టుబడులతో : ఏపీలో రూ.1425 కోట్ల పెట్టుబడులతో మ‌రో క‌ల సాకారం అవుతోంది. సర్వేపల్లిలో రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ కు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసారు. వర్చువల్ గా పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేసారు. ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్ధాపన చేశారు.

 jagan

క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేయడంతో పాటు గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను సీఎం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్‌ తయారీని చేపడుతున్న క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు శంకస్థాపన చేసారు. దీని ద్వారా రూ.610 కోట్ల పెట్టుబడి, 1000మందికి ఉద్యోగాలు రానున్నాయి.

సీఎం జగన్ శంకుస్థాపన : నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో ఇథనాల్‌ తయారీ కర్మాగారాన్ని పెడుతున్న విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్‌ ఇథనాల్‌ తయారీ కర్మాగార నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. దీని ద్వారా రూ.315 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి. తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్‌ కాఫీ లిమిటెడ్‌ పుడ్‌ మరియు బెవెరేజెస్‌ కంపెనీకి వర్చువల్‌గా శంకుస్థాపన చేసారు.

రూ.400 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ రోజు వండర్‌పుల్‌ మూమెంట్‌ గా సీఎం జగన్ పేర్కొన్నారు. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నామని.. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతున్నాయని వివరించారు.

 jagan

ఎన్నికల వేళ కొత్త ఉత్సాహం : పరిశ్రమలకు ఎలాంటి సహకారం కావాలన్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా...

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి. చాలా సంతోషకరమైన సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖ సమిట్ లో రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులకు జరిగిన నిర్ణయాల్లో భాగంగా..అవన్నీ వాస్తవరూపం దాల్చేలా ప్రయత్నాలు కసరత్తు జరుగుతోంది. ఈ పరిణామాలు రాజకీయంగానూ సీఎం జగన్ కు కలిసొచ్చేలా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+