టీటీడీ పాలక మండలి సిద్దం, ఆ ఎమ్మెల్యేలకు ఛాన్స్ - తుది జాబితాలో..!!!
Tirumala: ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటనకు రంగం సిద్దమైంది. ఎన్నికల వేళ ఈ జాబితా రూపకల్పన పైన ఆసక్తి నెలకొంది. ఏపీతో పాటుగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేతో పాటుగా ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటుగా మొత్తంగా 27 మందితో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డులో పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం.
టీటీడీ పాలక మండలి సభ్యులుగా: తిరుమల పాలక మండలి నియామకం పూర్తయింది. అధికారికంగా ప్రకటనే మిగిలింది. ఎన్నికల వేళ సీఎం జగన్ అన్ని రకాల సమీకరణాలు పరిగణలోకి తీసుకొని బోర్డుకు తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడా విమర్శలకు తావు లేకుండా సభ్యుల ఎంపిక చేసినట్లు సమాచారం. బోర్డులో ఈవో, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తుడా ఛైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా మొత్తం 27 మందితో ఈ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు- కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున, మహారాష్ట్ర నుంచి ముగ్గురికి అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏపీలోని 8 మంది ఎమ్మెల్యేలు, ధార్మిక సంస్థలకు చెందిన వారికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల వేళ ఆసక్తిగా: ఎన్నికల్లో సీట్ల అంశం కూడా టీటీడీ బోర్డులో ఎమ్మెల్యేకు అవకాశం కల్పించటంలో ప్రామాణికంగా మారుతోంది. ఎమ్మెల్యేలు పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖ రెడ్డి, జోగారావు, పల్నాడు జిల్లా నుంచి తాజాగా వార్తల్లో నిలిచిన ఒక ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు సతీమణి, కర్నూలు జిల్లాలో కీలక నేత పేర్లు దాదాపు ఖరారయ్యాయి.
నెల్లూరు నుంచి ఎంపీ కుటుంబానికి మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గోదావరి జిల్లాల నుంచి కాపు, శెట్టి బలిజ నేతలకు ప్రాధాన్యత కల్పించారు. భీమవరం కు చెందిన సుబ్బారాజు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. రంగమ్మ పేరును ఓకే చేసారని సమాచారం. అనంతపురం జిల్లా నుంచి ఒక సీనియర్ ఎమ్మెల్యే పేరుకు ఆమోదం తెలిపారని విశ్వసనీయ సమాచారం.
బోర్డుకు తుది రూపు: ఇదే సమయంలో తెలంగాణ నుంచి ముగ్గురు పేర్లు ఖరారయ్యని తెలుస్తోంది. అందులో ఒకరు సీనియర్ ఎమ్మెల్యేగా కాగా, మరొకరు ఫార్మా సంస్థల అధినేత యంయస్ఎన్ రెడ్డి పేరు ఖరారైందని సమాచారం. కర్ణాటక నుంచి సీఎం సిద్దరామయ్య సిఫార్సు మేరకు దేశ్ పాండే, బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాద్ పేర్లు ఖరారయ్యారని చెబుతున్నారు. అదే విధంగా తమిళనాడు నుంచి సీఎం స్టాలిన్ సిఫార్సు మేరకు తిరుపూర్ బాలా పేరు ఫైనల్ అయింది.
మహారాష్ట్ర నుంచి ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త సిఫార్సుకు ఆమోదం చెప్పినట్లు సమాచారం. మరో ఇద్దరి పేర్లు మహారాష్ట్ర నుంచి పరిశీలనలో ఉన్నాయి. తుడా ఛైర్మన్ హోదాలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ఈ సాయంత్రం అధికారికంగా జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications