జగన్ ఆపరేషన్ పిఠాపురం - పవన్ పై కొత్త అభ్యర్ది ఫిక్స్..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ జత కట్టారు. బీజేపీతో పొత్తు పైన ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలోనే టీడీపీ ,జనసేన ముఖ్య నేతల నియోజకవర్గాలపైన జగన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. పవన్ ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. దీంతె..అక్కడ వైసీపీ అభ్యర్ది పైన జగన్ కసరత్తు చేస్తున్నారు. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
వంగా గీతకు పిలుపు: పిఠాపరం నుంచి పవన్ పోటీ చేస్తారనే సమాచారంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. పవన్ పైన అభ్యర్దిగా ఎవరైతే పోటీ బాగుటుందనే అంశం పైన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. తాజాగా వంగా గీత సీఎంఓ నుంచి పిలుపు రావటంతో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిసారు.

హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరటంతో ఆయనకు సీటు పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బరిలోకి దించాలని వైసీసీ యోచిస్తోంది. ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రోజు లేదా రేపు ముద్రగడ నుంచి పార్టీలో చేరే అంశం పైన స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
పవన్ పోటీతో కొత్త లెక్కలు: పిఠాపురంలో ఇప్పుడు స్థానికంగా పార్టీ నేతల నుంచి ఐప్యాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది. పవన్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్ది అవుతారనే అంశం పైన ఆరా తీస్తోంది. గీత పర్ఫామెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్ పై పోటీ చేసే వాళ్ళు అగ్రెసివ్ గా ఉండాలని లెక్కలు వేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యేతోనూ వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లారని సమాచారం.
వంగా గీత గతంలో ప్రజారాజ్యం నుంచి 2009లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పటికీ వంగా గీతకు కాపు వర్గంలో స్థానికంగా మంచి పట్టు ఉంది. వైసీపీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తే గీతకు గెలుపుకు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ ఇంఛార్జ్ గా నియమించారు. ఇప్పుడు పవన్ పోటీ వార్తలతో వైసీపీ తాజా కసరత్తు మొదలు పెట్టింది.

వైసీపీ నిర్ణయంపై ఉత్కంఠ: ముద్రగడ తాజాగా పవన్ కు రాసిన లేఖ ద్వారా ఇక జనసేనలోకి వెళ్లే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో మంతనాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి రావటం ఖాయమైతే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఈ సమీకరణాల పైనే తాజాగా వంగా గీతతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో..అటు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అభ్యర్దిని మార్పు చేసిన సీఎం జగన్.. పవన్ పోటీ చేసే స్థానంలోనూ బలమైన అభ్యర్దిని ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసారు. దీంతో..పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్ది ఎవరనేది అధికారికంగా వచ్చే ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications