Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ ఇంఛార్జ్ ల మళ్లీ మార్పు..? కేశినేని స్థానంలో మరో నేత- శ్వేతకు అసెంబ్లీ సీటు..?

వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే ఖరారు చేసిన స్థానాల్లోనే మరోసారి మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తుది అభ్యర్దుల జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అరకు స్థానం నుంచి గతంలో ప్రకటించిన మాధవిని తప్పించారు. అక్కడ రాగం మత్సలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు. ఇక, ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ స్థానంలోనూ కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి.

ఇంఛార్జ్ ల మార్పు : సీఎం జగన్ ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారం కొనసాగుతోంది. గతంలో ప్రకటించిన జాబితాలో ఇంఛార్జ్ ల స్థానంలో మళ్లీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అరకు సిటింగ్‌ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానంలో అరకు ఎంపీ మాధవిని ఇన్‌చార్జిగా నియమించారు. దీనిపై స్థానిక నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసారు. గొడ్డేటి మాధవి నాన్ లోకల్ అంటూ వారు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి అక్కడి వైసీపీ నేతలతో చర్చలు జరిపినా తమకు లోకల్ నుంచే అభ్యర్థిని ఖరారుచేయాలని, లేకుంటే సహకరించబోమని కూడా వారు తెగేసి చెప్పారు. దీంతో పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది. గొడ్టేటి మాధవిని అరకు ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. రాగం మత్సలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు.

CM Jagan likely to field SC Candidate for Vijayawada loksabha in next Elections

కొత్త లెక్కలు : విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేనికి సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, తాగాజా ఐవీఆర్ఎస్ చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. విజయవాడ నుంచి ఎస్సీ నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. మొండితోక అరుణ్ కుమార్ పేరుతో పార్టీ సర్వే చేయిస్తోంది. అదే విధంగా కేశినేని నాని స్థానంలో ఎస్సీకి అవకాశం ఇస్తే ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారితే అక్కడ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. అదే సమయంలో జగ్గయ్యపేట నుంచి పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఫైనల్ గా దక్కేదెవరికి : అదే విధంగా ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు దాదాపు ఖాయమైంది. నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ పేరు ఖాయం కావటంతో ఆయన ప్రచార బరిలోకి దిగుతున్నారు. గుంటూరు ఎంపీ స్థానం కాపు వర్గానికి ఇవ్వటం పైన చర్చ సాగుతోంది. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. అదే విధంగా గతంలో ప్రకటించిన మరో నాలుగు స్థానాల్లోనూ అభ్యర్దులను మార్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లనే ఈ మార్పులకు సంబంధించి జగన్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+