Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ మంత్రులు, సీనియర్లు లోక్ సభకు - సీఎం జగన్ మార్క్ ఎంపిక..!!

ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపికలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీతో పాటుగానే లోక్ సభ అభ్యర్దుల సమీకరణాలను జగన్ పరిగణ లోకి తీసుకుంటున్నారు. ఒకే సారి అటు అసెంబ్లీ..ఇటు లోక్ సభకు అభ్యర్దులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ తన మార్క్ ఎంపిక చేస్తున్నారు. కొందరు సీనియర్లు..మంత్రులను లోక్ సభ బరిలో దించేందుకు సీఎం జగన్ నిర్ణయించారని సమాచారం.

అభ్యర్దుల పై కసరత్తు:ఏపీలో వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గెలుపే ప్రామాణికంగా అభ్యర్దుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేసారు. కొందరికి సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లు మరో విధంగా అవకాశం కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. వారసుల విషయంలోనూ సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలు..ఇంకొందరు మంత్రులు - సీనియర్లను ఎంపీలుగా బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను నిడుదవోలు ఎమ్మెల్యేగా దింపే అవకాశం ఉంది. రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి ఎంపీగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంగా గీత మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇదే సమయంలో చలమల శెట్టి సునీల్ రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

CM Jagan likely to field some of the minisers and Senior leaders for Loksabha in next Elections

గెలుపే ప్రామాణికంగా:ఏలూరు ఎంపీ అభ్యర్ది మార్పు ఖాయమని చెబుతున్నారు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బోళ్ల రాజీవ్ పేరు పరిశీలనలో ఉంది. నరసాపురం నుంచి అన్నీ అనుకూలిస్తే సినీ హరో దివంగత క్రిష్ణంరాజు సతీమణి శ్యామలను బరిలోకి దింపేలా ఇప్పటికే మిథున్ రెడ్డి సంప్రదింపులు చేసారని తెలుస్తోంది. శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరు పరిశీలిస్తున్నారు. గుంటూరు, విజయవాడ స్థానాల్లో లోక్ సభ అభ్యర్దుల విషయంలో సీఎం జగన్ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక, నర్సరావు పేట నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది.

ఒంగోలు నుంచి కరణం బలరాంను బరిలోకి దించాలనేది సీఎం జగన్ ఆలోచన గా సమాచారం. అనంతపురం నుంచి ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఖాయంగా కనిపిస్తోంది. హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ నుంచి ఎంపీగా పోటీ చేయించే అంశం పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

CM Jagan likely to field some of the minisers and Senior leaders for Loksabha in next Elections

కొనసాగుతున్న ఉత్కంఠ:హిందూపురం ఎమ్మెల్యేగా టీఎస్ దీపిక పేరు ఖాయమైంది. కర్నూలు ఎంపీగా టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలోకి వస్తుండటంతో..వారికి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో బుట్టా రేణుక పేరు పరిశీలనలో ఉంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరు ఖాయమైంది. తిరుపతి, కడప, నంద్యాల, రాజంపేట, మచిలీపట్నం ఎంపీల స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం లేదు.

ఇక, శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. విజయనగరం నుంచి మంత్రి బొత్సా ను బరిలోకి దింపటం పైన చర్చ సాగుతున్నట్లు సమాచారం. అయితే, బొత్స సతీమణికి ఇవ్వటం పైనా చర్చ జరుగుతోంది. అనకాపల్లి ఎంపీగా మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. దీంతో, సీఎం జగన్ కసరత్తు..అభ్యర్దుల ఖరారు పైన వైసీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+