వైసీపీలో వారసులకు లైన్ క్లియర్ అయ్యేదెవరికి - ఏం జరుగుతోంది..!!

వచ్చే ఎన్నికలకు జగన్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. సీట్ల ఖరారు పైన ఫోకస్ పెట్టారు. సర్వే నివేదికలతో ఎమ్మెల్యేల పని తీరు పైన పూర్తి సమాచారం సిద్దం చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ప్రధాన నాయకులు మధ్య పార్టీ టికెట్ కోసం పోటాపోటీ నెలకోంది. సీనియర్లు కొందరు తమ వారసులను రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వారసుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది. కొందరు సీనియర్లు మాత్రం తమ వారసులు రంగంలో ఉంటారంటూ చెప్పుకొస్తున్నారు.

సీఎం జగన్ కొత్త వ్యూహాలు..
మారుతున్న రాజకీయ సమీకరణాలతో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నేతలకు రూట్ మ్యాప్ నిర్దేశించిందేకు ఈ రోజు (సోమవారం) కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఇందులొ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు..నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో సస్పెన్షన్ అంశం పైన ముఖ్యమంత్రి ప్రస్తావన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పని తీరు ఆధారంగా సీట్లు ఇచ్చే అంశం పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వనున్నారు. గడప గడపకు ప్రభుత్వం..జగనన్నతోనే భవిష్యత్ కార్యక్రమాల పైనా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. దీని పైన శిక్షణా శిబిరాల నిర్వహణకు నిర్ణయించారు.

CM Jagan likely to give clarity on seats for senior leaders successors in next Elections in today meeting

వారసులకు సీట్ల పైనా క్లారిటీ ఇస్తారా
గతంలో జరిగిన సమావేశాల్లో వారసులకు సీట్లు ఇవ్వటం పైన చర్చ జరిగింది. మంత్రి బుగ్గన..పేర్ని నాని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారని..ఈ సారి ఆ ఇద్దరూ తనతో పాటుగా ఉండాలని సీఎం సూచించారు. వారసులను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయటం పైన అభ్యంతరం లేదని, వచ్చే ఎన్నికలు కీలకం కావటంతో పోటీలో ఉండాలని సీఎం స్పష్టం చేసారు. దీంతో, మిగిలిన సీనియర్లు ఈ సారి తమ వారసుల పోటీ విషయంలో సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డికి సీటు ఇచ్చేందుకు అంగీకరించారని, వచ్చే ఎన్నికల్లో మోహత్ చంద్రగిరి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో..మరోసారి వారసుల అంశం పైన చర్చ మొదలైంది.

ఎవరికి సీఎం అవకాశం ఇచ్చేను
తిరుపతి, ఒంగోలు, ఎమ్మిగనూరు, రామచంద్రాపురం, ఎలమంచిలి, అమలాపురం, పాణ్యం నియోజకవర్గాల్లో తమ వారసులకు సీట్లు ఇవ్వాలని ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. అదే విధంగా సీనియర్ నేతలు ధర్మాన ప్రసాద రావు, ధర్మాన క్రిష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, మంత్రి బొత్సా సత్యానారాయణ సైతం తమ వారసులను బరిలోకి దించే యోచన చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి అందరికీ ఒకే విధమైన నిర్ణయం కాకుండా..స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+