Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీలక నిర్ణయం దిశగా సీఎం జగన్ - మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్..!?

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ ఇక విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటు కేబినెట్ విస్తరణ.. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు.

ఈ సమయంలో పార్టీ సీనియర్ నేతలు..మంత్రులు..ఎమ్మెల్యేలకు తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠను పెంచుతోంది.

CM Jagan likely to give road map for party leaders for next Elections, key meeting with MLAs

పార్టీ నేతలతో కీలక భేటీ

ఎన్నికలకు సిద్దం అవుతున్న సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే పలు మార్లు గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ ను సీఎం జగన్ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు వారికి ప్రజల్లో ఉన్న గుర్తింపు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పైన సంకేతాలు ఇస్తూ వచ్చారు. కొందరు ఎమ్మెల్యేలకు పని తీరు మెరుగు పర్చుకోవాలంటూ స్పష్టం చేసారు.

ఇక.. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కావటం..వారితో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయటంతో ఆ నలుగురిని పార్టీ సస్పెండ్ చేసింది. అనూహ్యంగా నాలుగు పట్టభ్రదుల నియోజకవర్గాలు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ సమయంలో పార్టీ నేతలతో సీఎం జగన్ ఎన్నికల దిశగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.

కొత్త జోష్ నింపేలా కార్యాచరణ

ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్..పట్టభద్రుల నియోజకవర్గాల్లొ టీడీపీ గెలుపు తరువాత పార్టీలో ఎటువంటి నైరాశ్యం లేకుండా సీఎం జగన్ మార్గదర్శకం చేయనున్నారు. పార్టీ నేతల్లో జోష్ నింపుతూ..టీడీపీ గెలుపు ఎలా సాధ్యమైంది..దీని ద్వారా వైసీపీ పైన ఎటువంటి ప్రభావం ఉంటుందనే అంశాన్ని సీఎం వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 22 మంది ఎమ్మెల్యేల పని తీరు మెరుగు పర్చుకో వటం పైన సీఎం సూచనలు చేసారు.

ఇప్పుడు పార్టీలో టికెట్లు ఇవ్వరనే కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కావటంతో..సీట్ల విషయంలో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అదే సమయంలో గెలుపే ప్రామాణికంగా సీట్ల కేటాయింపు ఉంటుందనే అంశం మరోసారి స్పష్టం చేస్తారని..పార్టీని నమ్ముకున్న వారికి సీట్లు రాకున్నా వారి సేవలను మరో విధంగా ఉపయోగించు కుంటామని సీఎం చెబుతారని తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణ పైనా క్లారిటీ

ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీని పైన ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రచారం సాగుతున్నట్లుగా ప్రక్షాళన ఉంటుందా లేదా అనేది స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.

ఇక, కొద్ది రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం సాగుతోంది. గతంలో ఇదే తరహా ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండించారు. దీని పైన సీఎం జగన్ తేల్చి చెప్పే అవకాశం కనిపిస్తోది. మంత్రివర్గ విస్తరణ.. ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు పైన ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ మంత్రులు..ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+