విశాఖ నుంచి పాలన ప్రారంభం - నిర్ణయంలో మార్పు..!?
విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ పాలన ప్రారంభం ముహూర్తం వాయిదా పడినట్లు తెలుస్తోంది. దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేలా కొంత కాలంగా కసరత్తు జరుగుతోంది. తాజాగా కార్యాలయాల ఏర్పాటు పైన అధికారుల కమిటీని ఏర్పాటు చేసారు. తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ లో సీఎం పాలన ప్రారంభం వచ్చే నెలకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.
విశాఖలో పాలన ప్రారంభం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలనేది సీఎం జగన్ ఆలోచన. అందులో భాగంగా విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని ముందుగా తన క్యాంపు కార్యాలయం అక్కడ ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు.

విశాఖ నుంచి పాలన ప్రారంభించే అంశం పైన రెండు మూడు సందర్భాల్లో సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. దీంతో, దసరా నుంచి సీఎం జగన్ విశాఖలో పాలన ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం సాగింది. వారంలో రెండు రోజులు విశాఖ నుంచి పాలన కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు ప్రారంభించారు.
వచ్చే నెలకు వాయిదా..!: అయితే, తాజాగా ఈ ముహూర్తం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.ముఖ్యమంత్రి జగన్ అక్టోబర్ లేదా నవంబర్ లో విశాఖకు వస్తారని చెప్పుకొచ్చారు. సీఎంతో పాటుగా వచ్చే అధికారులకు విశాఖలో వసతులు సమకూర్చాల్సి ఉందని చెప్పారు. వీటి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించారు.
ఈ కమిటీ అన్ని పరిశీలించి..పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తుందని వివరించారు. కమిటీ చేసే సూచనలకు అనుగుణంగా పనులు మొదలవుతాయని సుబ్బారెడ్డి వెల్లడించారు. దీని ద్వారా.. ఈ నెలలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించే అవకాశం లేదనే అంశం పైన స్పష్టత వచ్చింది. నవంబర్ లేదా డిసెంబర్ లో విశాఖ నుంచి పాలన ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికల కార్యాచరణ: ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించారు. ప్రతీ వర్గం..అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి తమ విధానమని చాటారు. దీంతో పాటుగా ఎన్నికల వరకు పార్టీ కేడర్ కు కార్యాచరణ నిర్దేశించారు. పార్టీ నేతలు ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ విశాఖ నుంచి పాలన ప్రారంభించటం ద్వారా రాజకీయంగానూ పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, పాలనా పరంగా అనుసరించాల్సిన విధి విధానాల్లో భాగంగా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications