టీచర్ల నియామకాలపై సీఎం జగన్ కీలక సూచనలు..!!
పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతుల నిర్వహించాలని ఆదేశించారు. టీచర్ల నియామకానికి సంబంధించి ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలని సీఎం స్పష్టం చేసారు.. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నారు. పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదరని సీఎం జగన్ అధికారులకు తేల్చి చెప్పారు.
స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్షించారు.పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తోందని పేర్కొన్నారు. పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నామని..ఇంటర్ వరకు పథకం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంటర్ తరువాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రతీ దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అందుకే డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని సీఎం నిర్దేశించారు.

వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష చేసారు. విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు సీఎంకు వివరించారు. పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం సమీక్ష చేపారు. జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడించారు. స్కూలు పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలపై సీఎం ఆరా తీసారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ పైనా అధికారులతో సమీక్ష చేసారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నా ప్రత్రాల్లో క్యూ ఆర్ కోడ్ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామమని వివరించారు. విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎంకు వివరాలు అందించారు. ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్న సీఎం జగన్ నిర్దేశించారు.












Click it and Unblock the Notifications