సీఎం జగన్ మాస్టర్ స్కెచ్, టీడీపీకి దిమ్మతిరిగేలా - ఢిల్లీ వేదికగా...!!

ఎన్నికల వ్యూహాల్లో సీఎం జగన్ రాటు తేలారు. వచ్చే ఎన్నికలకు కొత్త వ్యూహాలు..అస్త్రాలతో సిద్దం అవుతున్నారు. పక్కా ప్లానింగ్ తో పరిస్థితిని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం లేకుండా కసరత్తు మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 నినాదం వెనుక భారీ ప్లాన్ కనిపిస్తోంది.

తాజా మంత్రివర్గ సమావేశంలోనూ ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని ..మీరు కష్టపడండి..మిగతాది నేను చూసుకుంటానంటూ జగన్ చాలా ధీమాగా చెప్పారు. జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసిన మంత్రులు హ్యాపీ ఫీలయ్యారు. అధికారంలోకి వస్తామా రామా అనే అనుమానం ఉన్న నేతలకు జగన్ మాటలతో నమ్మకం పెరిగింది. దీనికి కొనసాగింపుగా ఎన్నికల నిర్వహణ కోసం జగన్ కొత్త ప్లాన్స్ సిద్దం చేస్తున్నారు.

chandrababu

కొత్త ఆలోచనల్లో సీఎం జగన్ : ఏపీలో వచ్చే మార్చి- ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు ఒకే ద‌శ‌లో జ‌రుపుతూ వ‌చ్చారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం రెండు ద‌శ‌ల్లోనే పోలింగ్ జ‌రిగిన ఆన‌వాయితీ ఉంది. అయితే, 2019లో అస‌లు ప్రాబ‌ల్యంలేని బిజేపీ రాష్ట్రాల‌లో ఐదు నుంచి ఎనిమిది ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం వ‌ల్ల భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌ణ‌నీయంగా త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంది. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం దీనికి పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

2021లో ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు 8 ద‌శ‌ల్లో జ‌రిగేలా ఎన్నిక‌ల సంఘాన్ని కేంద్రం ఒప్పించ‌గ‌లిగింది. దీనివ‌ల్ల ఆ రాష్ట్రంలో బిజేపీ సీట్లు, ఓట్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఇప్పుడు జ‌గ‌న్ ఈ ఫార్ములానే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ తాను ప్ర‌చారం చేయ‌డ‌మేకాదు, పార్టీ క్యాడ‌ర్‌కు అవ‌స‌ర‌మైన అండ‌దండ‌లు అందించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

 jagan

ప్రతిపక్షాలపై పై చేయి సాధించేలా : ఇలా చేయటం వలన ఎలక్షన్ మేనేజ్ మెంట్..పోల్ నిర్వహణలో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల వ్యవహారాలు..ఎత్తుల పైన ఫోకస్ చేయటం ఈ మ‌ల్టీ ఫేజింగ్ విధానంలో సాధ్య‌మ‌వుతుంద‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల ఎత్తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డానికి, వైసీపీ అభ్య‌ర్థి బ‌ల‌హీన‌త‌ల‌ను గ‌ట్టెక్కించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌మ‌యం ఈ మల్టీ ఫేజింగ్ పోలింగ్ విధానంలో సాధ్య‌మ‌వుతుంద‌ని జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నార‌ని చెబుతున్నారు.

ఇదే సమయంలో విడతల వారీగా పోలింగ్ ప్రతిపక్షాల కంటే అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా మారుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న సామాజిక - రాజకీయ పరిస్థితుల్లో విడతల వారీ పోలింగ్ మేలు చేస్తుందనే అంశాన్ని బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచన ప్రతిపక్ష టీడీపీకి సమాచారం అందినట్లుగా ప్రచారం సాగుతోంది.

 ys-jagan-chandrababu

ఎన్నికల సంఘం నిర్ణయమే కీలకం : తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలోనూ ఈ అంశం పైన చర్చ జరిగినట్లు ప్రచారం. ఎన్నికల తరువాత ఎన్డీఏకు మద్దతుగా ఉంటామని చెప్పినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌లో భాగంగా ఎన్నిక‌లు ఐదారు ద‌శ‌ల్లో జ‌రిగితే త‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన న‌ష్టం జ‌రుగుతుంద‌ని..అలా విడతల వారీ పోలింగ్ అధికార పార్టీకి కలిసి వస్తుందని విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే, ఎన్నికల నిర్వహణ పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న జనాభా..నియోజకవర్గాలు..శాంతి భద్రతల అంశం ఆధారంగా ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం ఉండదు. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లాంటివి ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌నుకున్న‌ప్పుడు ఎన్నిక‌ల సంఘం కేంద్రం స‌ల‌హాకు విలువ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ సారి ఏపీలో హోరా హోరీగా ఎన్నికలు ఖాయం అని భావిస్తున్న సమయంలో జగన్ ప్లాన్ కు కేంద్రం అండగా నిలుస్తుందా..లేక టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+