సీఎం జగన్ మాస్టర్ ప్లాన్: రాజధానులకు 50 వేల కోట్ల రుణం- కేంద్రం అంగీకారం : అమరావతి వైపు..!!
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకున్నారు. గతంలో చేసిన బిల్లులను రద్దు చేసారు. సమగ్ర బిల్లుతో మరోసారి సభ ముందుకొస్తామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో సీఎం జగన్ భారీ స్కెచ్ తో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అటు అభివృద్ధి పైన విమర్శలు..ఇటు చంద్రబాబు రాజకీయాన్ని ఒకే సారి దెబ్బ కొట్టేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ముందుగా అమరావతి పైన ఉన్న కోర్టు కేసులు తన వ్యూహానికి అడ్డు కాకుండా.. ఒక అడుగు వెనక్కు వేసి బిల్లులనే ఉపసంహరించుకున్నారు.
Recommended Video

ప్రపంచ బ్యాంకు నుంచి రూ 50వేల కోట్ల రుణం
ఇప్పుడు ఆర్దికంగా కష్టాల్లో ఉన్న తన పాలన పైన ప్రధానంగా వినిపిస్తున్న అభివృద్ధి కనిపించటం లేదనే విమర్శతో పాటుగా..రాజకీయంగా చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టేసే రాజకీయ వ్యూహాలను జగన్ పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. రాజధానులు.. అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించి ముఖ్యమంత్రి దీని కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ 50 వేల కోట్ల రుణం సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు కు దరఖాస్తు చేసారు. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ప్రస్తుతం ఆ ప్రతిపాదన ప్రపంచబ్యాంకు పరిశీలనలో ఉంది.

ముందస్తు వ్యూహంలోనే బిల్లులు వెనక్కు
అందు కోసమే రాజధానుల వ్యవహారం పైన రుణ సేకరణ కోసం ఎక్కడా లిటిగేషన్లు లేకుండా.. ప్రపంచ బ్యాంకు రుణం అంగీకరించే విధంగా లైన్ క్లియర్ చేస్తున్నారు. ఈ మొత్తం 50 వేల కోట్ల రుణంతో ప్రభుత్వం ఏ రాజధాని అభివృద్ధి చేస్తారనే చర్చ మొదలైంది. అయితే, జగన్ అమరావతి కి ప్రాధాన్యత ఇస్తూ విశాఖలో మౌళిక వసతుల అభివృద్ధికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో రీజనల్ బోర్డుల ఏర్పాటు పైనా కసరత్తు చేస్తున్నారు. మొత్తం 13 జిల్లాలను నాలుగు రీజనల్ డెవలప్ మెంట్ బోర్డుల పరిధిలోకి తెస్తూ..అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం ఆచరణలో చూపెట్టాలని యోచిస్తున్నారు.

ఆ నిధులు మొత్తం రాజధాని కోసమే
ఆర్దికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా..ఈ నిధులు మాత్రం రాజధాని కోసమే వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. అమరావతిలొ మధ్యలో నిలిచిపోయిన భవనాలు పూర్తి చేయటం..అక్కడకే ప్రభుత్వ కార్యాలయాల తరలింపు.. రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వటం.. మౌళిక వసతుల కల్పన ద్వారా ఇప్పటి వరకు తాను ఆ ప్రాంతానికి..అక్కడి ప్రజలకు వ్యతిరేకమనే భావనకు ముగింపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి పైనా ఫోకస్ పెట్టటం ద్వారా రాజకీయంగా ఎక్కడా నష్టం రాకుండా చూసుకోవాలని యోచిస్తున్నారు.

రాజకీయంగానూ కౌంటర్ ఇచ్చేలా
ఇదే సమయంలో అమరావతి పేరుతో చంద్రబాబు రాజకీయంగా తమను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ బ్యాంకు షరతులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకున్న అన్నింటికీ సిద్దపడే రుణం కోసం ముందడుగు వేసింది. కేంద్రం మద్దతు సైతం లభించటంతో ఏపీ ప్రభుత్వానికి 2024 ఎన్నికలకు వెళ్లేందుకు ఈ రుణం కీలకం కానుంది. ఈ క్యాపిటల్ డెవలప్ మెంట్ రుణం తీసుకొనే సమయం లో మాత్రం అమరావతికే ప్రాధాన్యతగా చూపించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

క్యాపిటల్ డెవలప్ మెంట్ రుణం
రాజధాని పైన సాంకేతికంగా ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఇప్పుడు తీసుకోవాలని భావిస్తున్న క్యాపిటల్ డెవలప్ మెంట్ రుణం ద్వారా అమరావతికి మిగిలిన వాటి కంటే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా ఈ రుణం మంజూరుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వానికి దక్కితే ..ఇక, రానున్న రెండేళ్ల కాలంలో పూర్తిగా తన వ్యూహాలకు అనుగుణంగా సీఎం జగన్ అడుగులు వేసే అవకాశం ఉంది.

2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు
సంక్షేమ పధకాల అమలు పైన ప్రజల్లో అధిక శాతం జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, అభివృద్ధి విషయంలో మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. దీనినే చంద్రబాబు రాజకీయ అస్త్రంగా మలచుకుంటున్నారు. రాజధాను అంశం.. అభివృద్ధి వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో..2024 ఎన్నికల నాటికి ఏ ప్రాంతాన్ని తాము విస్మరించలేదనే విధంగా ముందకెళ్లే ప్రయత్నాలు సీఎం చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణం..తదుపరి అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications