Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఎమ్మెల్యేలతో జగన్ ఫేస్ టు ఫేస్: అభ్యర్దుల మార్పు - హామీలు..!!

వైసీపీలో రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. నేరుగా సీఎం రంగంలోకి దిగారు. సీటు మార్చే ఎమ్మెల్యేలను పిలిపించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంతనాలు సాగుతున్నాయి. గెలుపే ప్రామణికంగా మార్పులు చేయాల్సి వస్తుందని వివరిస్తున్నారు. సీటు నిరాకరిస్తున్న వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావటం కోసమే నిర్ణయాలు తప్పటం లేదని చెబుతున్నారు. దీంతో..ప్రస్తుతం సీఎం నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఎన్నికల కసరత్తు : ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందో వారిని మార్చేందుకు నిర్ణయించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసారు. మరో జాబితా సిద్దంగా ఉంది. అందులో భాగంగా గోదావరి ,గుంటూరు జిల్లాలకు చెందిన వారికి సీఎంఓ నుంచి పిలుపు రావటంతో గోదవరి జిల్లాల్లోని పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, చింతలపూడి, రామచంద్రాపురం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తుందీ సీఎం వివరిస్తున్నారు. వారి స్థానంలో నియమించే వారి సమాచారం అందిస్తున్నారు. సహకరించాలని సూచిస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు.

CM Jagan may change Five sitting MLAs in godavari dist and in Prakasam as reports

ఎమ్మెల్యేలతో నేరుగా : అభ్యర్దుల ఖరారు పైన ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజుల సమావేశాలకు సీఎం నిర్ణయించారు. వచ్చే వారం ఎంపీలతో సమావేశం కానున్నారు. ఏ క్షణంలో అయినా నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పు పై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పిఠాపరం ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతకు నియోజకవర్గ ఇంఛార్జ్ గా బాధ్యతలు కేటాయింపు ఖాయమైంది. దీనికి సంబంధించి గీతకు క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. కాకినాడ ఎంపీ స్థానం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యేను మార్చటం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా ప్రత్తిపాడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పర్వతనేని పూర్ణచంద్రప్రసాద్ స్థానంలో పర్వతనేని జానకీ దేవి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

CM Jagan may change Five sitting MLAs in godavari dist and in Prakasam as reports

మార్పులు - చేర్పులు : అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ స్థానంలో మాజీ ఎంపీ...సీనియర్ నేత తోట నర్సింహం పేరు ఖరారు చేసారు. తోట నర్సింహం 2014లో కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలిచి పార్టీ లోక్ సభలో ఫ్లోర్ లీడర గా పని చేసారు. 2004, 2009 లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2019లో వైసీపీలో చేరి ఆయన సతీమణి తోట వాణి పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి జగ్గంపేట నుంచి తోట నరసింహం కు సర్వే నివేదికలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. జ్యోతుల చంటిబాబుకు సీఎం తన నిర్ణయం వివరిస్తున్నారు. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వేణుకు స్థాన చలనం ఖాయంగా కనిపిస్తోంది. రాజమండ్రి ఎంపీ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పంపే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ తీసుకొనే నిర్ణయాలపైన ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+