రైతులకు శుభవార్త.. వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత నగదు రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. సాగుకు అవసరమైన పెట్టుబడి సాయం కింద వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత నిధులను విడుదల చేసింది. స్వయంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 1,036 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ నిధుల ద్వారా రైతన్నకు పెట్టుబడి ఖర్చులు తప్పనున్నాయని పేర్కొన్నారు.

మూడోవిడత నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.1,036 కోట్ల నగదును రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. తద్వారా రాష్ట్రంలో మొత్తం 50,58,489 మంది అన్నదాతలకు లబ్ధి చేకూరనుంది. 2021-22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ చేసింది. గడిచిన మూడేళ్లలో వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అన్నదాతలకు అందించింది. ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ. 13,500 కోట్ల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ స్పష్టం చేశారు

అన్నదాతకు పెట్టుబడి సాయం
ఈ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతుల ఖాతాల్లో రూ.5,863.67 కోట్లను ఏపీ ప్రభుత్వం జమ చేసింది. వీటిలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ కింద రూ.2,015.34 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం కింద 48,86,361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్ఓఎఫ్ఆర్-దేవదాయ భూములు సాగుచేస్తున్న రైతులు, 68,737 మంది కౌలుదారులు లబ్ధిపొందారు. పీఎం కిసాన్ కింద కేంద్ర ఇచ్చే రూ.4 వేలు, రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 కలిపి మొత్తం రూ.11,500లను ప్రతి ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తోంది.

ప్రతి ఏటా రూ. 11,500 చొప్పున ..
మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకుపీఎం కిసాన్ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు కేంద్రం జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్ఆర్ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు ఏపీ ప్రభుత్వం జమచేస్తోంది. అటు కొత్తగా సాగుహక్కు పత్రాలు పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్ఆర్ రైతుభరోసా పథకం కింద ఒకేవిడతగా రూ.11,500 చొప్పున రూ.28.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
Recommended Video

రైతు ప్రభుత్వం
2021-22లో మూడు విడత కలిపి 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించింది. దీంటో వైఎస్సార్ రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,907.06 కోట్లు జమచేస్తుండగా, కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2,992.61 కోట్లు అందిస్తోంది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమాన్య హక్కులు కలిగిన రైతులు కాగా, 82,251 మంది ఆర్ఓఎఫ్ఆర్-దేవదాయ భూముల సాగుదారులు, మిగిలిన 89,877 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు ఉన్నారు. అటు తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ రైతులకు మాత్రం రెండు విడతల్లో రైతు భరోసా కింద రూ.11,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే జమచేసింది. రైతుల వెన్నంటి ఉండేది తమ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications