1.50 కోట్ల మందిపై జగన్ గురి, ఇదీ లెక్క - ఎన్నికల వేళ బిగ్ టర్న్..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం ఇవ్వటానికి సిద్దంగా లేరు. ఫిబ్రవరి ద్వితీయార్ధం నుంచి ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉందని ఇప్పటికే మంత్రులను సీఎం జగన్ అలర్ట్ చేసారు. ఎన్నికల కార్యాచరణ సిద్దం చేసారు. 30 రోజుల సమయంలో కోటిన్నార మందికి దగ్గరయ్యేలా ప్లాన్ చేసారు. ఇప్పుడు అదే ప్రతిపక్షాల్లో టెన్షన్ కు కారణమవుతోంది. ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్ కానుంది.
ఎన్నికలకు సిద్దం : ఏపీలో ఫిబ్రవరి 20 తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో..రేపటి నుంచి జనవరి నెలాఖరు లోగా తన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకొనే విధంగా జగన్ భారీ ప్లాన్ సిద్దం చేసారు. ఏకంగా 1.50 కోట్ల మందిని తన వైపు తిప్పుకొనే విధంగా లెక్క సెట్ చేసారు. తనకు రెండో సారి విజయం తెచ్చిపెడతుందన్న నమ్ముతున్న సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేయనున్నారు. దీని కోసం ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 19న విద్యా దీవెన, విద్యా వసతి నిధులు విడుదల చేయనున్నారు. జనవరి మాసం నుంచి పెన్షన్ రూ 3 వేలకు పెంచటంతో పాటుగా దాదాపు కోటిన్నార మంది మహిళలకు లబ్ది జరిగేల పథకాల అమలుకు సమయం నిర్ణయించారు. ఇదే ఇప్పుడు ఎన్నికల వేళ బిగ్ టర్న్ కానుంది.

30 రోజులు - కోటిన్నార మంది : ఈ నెల 21వ తేదీన జగన్ జన్మదినం నాడు 4.35 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్ లు అందించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 65.33 లక్షల మందికి పెరిగిన పెన్షన్ రూ 3 వేలు అందనుంది. జనవరి 10వ తేదీ నుంచి ఆసరా పథకం ద్వారా ఇప్పటికే 78.81 లక్షల మందికి 19,165 కోట్లు పంపిణీ చేసారు. తాజాగా చివరిదైన నాల్గవ విడత రూ 6,393 కోట్ల రూపాయాలను ఆసరా లబ్దిదారులకు అందించనున్నారు. అదే విధంగా 29వ తేదీ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ది దారులకు 18,750 కోట్లు పంపిణీకి నిర్ణయించారు. దీని ద్వారా 30 రోజుల పాటు సంక్షేమ పండుగ నిర్వహించి దాదాపు కోటిన్నార మందికి లబ్ది కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కోటిన్నార మందికి ఎన్నికల వేళ జరిగే లబ్ది రాజకీయంగా వైసీపీకి ప్రయోజనకరంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.

గెలుపుకు మలుపుగా నిలిచేనా : ఇటు టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైన కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెల తొలి వారంలో ప్రకటించేందుకు సిద్దమవుతున్నాయి. అయితే, టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. దీంతో..మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పరంగా ఎమ్మెల్యేలు..నియోకవర్గ ఇంఛార్జ్ లను అవసరమైన చోట జగన్ మారుస్తున్నారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న పథకాలే తనకు ఓట్లు తెచ్చి పెడతాయనే నమ్మకంతో ఉన్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఒకే నెలలో కోటిన్నార మందికి లబ్ది చేయటం ద్వారా ఖచ్చితంగా ఇది గెలుపుకు మలుపుగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications