వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులు -ఎమ్మెల్యేల పై సీఎం జగన్ ప్రోగ్రస్ రిపోర్టు : డౌట్ - అవుట్ లిస్టు రెడీ..!!

|
Google Oneindia TeluguNews

CM Jagan: ఏపీలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నికల రోడ్ మ్యాప్ సిద్దం చేసారు. మంత్రులు - ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపారు. సీఎం జగన్ తన ఓట్ బ్యాంకు పెంచుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే జయహో బీసీ నిర్వహించిన విధంగానే..మరో మూడు రాష్ట్ర స్థాయి సభలకు సిద్దం అవుతున్నారు. అదే సమయంలో పోలింగ్ బూత్ టు వైసీపీ హెడ్ క్వార్టర్స్ వరకు పూర్తి అనుసంధానం చేస్తున్నారు. ఇక, కీలకమైన ఎమ్మెల్యేల ఎంపిక విషయంలోనూ తుది నిర్ణయానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 17 తేదీల్లో మంత్రులు - ఎమ్మెల్యేలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలకు ఈ భేటీ ద్వారా క్లారిటీ ఇచ్చేందుకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

జయహో బీసీ తరహాలోనే మరో మూడు సభలు

జయహో బీసీ తరహాలోనే మరో మూడు సభలు


వైసీపీ నిర్వహించిన జయ హో బీసీ సభ పైన ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా..సభ సక్సెస్ అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ లోని బీసీ నేతలకు సీఎం జగన్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి బాధ్యతలు అప్పగించారు. బీసీలకు ప్రభుత్వం - పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. ఈ సభ తరహాలోనే మరో మూడు సభల నిర్వహణ పైన కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ - ఎస్టీ- మైనార్టీ వర్గాలతో ఇదే తరహాలో సభలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించేదుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా తాను నమ్ముకున్న ఈ నాలుగు వర్గాలకు మరింత దగ్గరయ్యేందకు ముఖ్యమంత్రి కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. బూత్ స్థాయిలోనూ ఈ నాలుగు వర్గాలతో పాటుగా ఖచ్చితంగా మహిళ ఉండేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. మంత్రులు - ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నిర్వహించే సమావేశంలోనూ మరసారి ఈ అంశాన్ని స్ఫష్టం చేయనున్నారు.

150 మంది ప్రోగ్రస్ రిపోర్టులు రెడీ - ఇక నిర్ణయం దిశగా

150 మంది ప్రోగ్రస్ రిపోర్టులు రెడీ - ఇక నిర్ణయం దిశగా


వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపికలో సీఎం జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేయటంతో..ప్రస్తుతం నియెజకవర్గాల సమీక్షలను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకే పరిమితం చేసారు. అక్కడ పార్టీ అభ్యర్ధుల పైన క్లారిటీ ఇస్తున్నారు. ఇక, గతంలో నిర్వహించిన పార్టీ వర్క్ షాపులో 27 మంది ఎమ్మెల్యేల పని తీరు సీఎం అసహనం వ్యక్తం చేసారు. వారు తమ పని తీరు సరిదిద్దుకోవటానికి సమయం నిర్దేశించారు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి పలు కోణాల్లో సీఎం జగన్ క్షేత్ర స్థాయి సమాచారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరినీ వదులుకోవటం తనకు ఇష్టం లేదని సీఎం స్పష్టం చేసారు. అయితే, నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఉంటేనే సీటు ఇస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కీలకమని.. సీటు దక్కని వారికి పార్టీలో మరో పదవి కేటాయిస్తానని చెబుతున్నారు. ఈ సారి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంత మంది తమ గ్రాఫ్ పెంచుకున్నారు..టికెట్ ఖాయమనే వారి సంఖ్య పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మూడు రాజధానులు - అభివృద్ధి నిధులు

మూడు రాజధానులు - అభివృద్ధి నిధులు


ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం విషయంలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నారు. ఇదే సమయంలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పదే పదే అభివృద్ధి గురించి ప్రస్తావిస్తుండటంతో ఆ అవకాశం ఇవ్వకూడదనేది సీఎం అభిప్రాయం. దీంతో, ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సచివాలయల వారీగా కేటాయించిన నిధుల వ్యయం పైన కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా నియోజకవర్గాల్లో వెంటనే చేయాల్సిన అభివృద్ధి పనుల పైన ఇప్పటికే సీఎంఓ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదే విధంగా మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ ఆలోచనలు..కార్యాచరణను సీఎం స్పష్టం చేసే అవకాశం ఉంది. మొత్తంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ రోడ్ మ్యాప్ ను సీఎం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.

English summary
CM Jagan to hold crucial meeting with ministers and party mlas on finalisation of road map for next coming elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X