సీఎం జగన్ కొత్త ఫార్ములా - వర్కౌట్ అయితే తిరుగే లేదు : ఆట మొదలైంది..!!
ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల కోసం కొత్త ప్రణాళిలు సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్ బ్యాంక్ కు గండి కొట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. తటస్థ ఓటర్లను ఓన్ చేసుకొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రతిపక్షాలు మూకుమ్మడిగా జగన్ లక్ష్యంగా కలిసి పని చేయటానికి రంగం సిద్దం చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ సత్యసాయి జిల్లా వేదికగా ఎవరెన్ని కుట్రలు చేసినా తాను ఎదుర్కొంటానని స్పష్టం చేసారు. ఇక, ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్..తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపారు. అదే సమయంలో ఎమ్మెల్యేల పైన ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

టార్గెట్ ఓట్ బ్యాంక్
ఇక, సంక్షేమ పథకాల అమలుతో ఖచ్చితంగా తనకు వచ్చే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని ధీమాగా ఉన్నారు. ఇక, సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు రాష్ట్రంలో గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ టీడీపీపైన అనూహ్య గెలుపును అందించింది. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తూనే..ఇప్పుడు టీడీపీ -బీజేపీ- జనసేన వంటి పార్టీలు కొన్ని వర్గాల పైన ఆశలు పెట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంత ఓటింగ్ పూర్తిగా జగన్ కు అనుకూలంగా ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అయితే, డెవలప్ మెంట్. .ఉద్యోగాలు.. రాష్ట్ర అప్పుల పేరుతో విద్యావంతులు - మేధావులు - మధ్య తరగతి ప్రజలు- ఉద్యోగులు - యువత ను తమ వైపు తిప్పుకొనేందుకు అవే ప్రధాన ప్రచారాస్త్రాలుగా టీడీపీ రంగంలోకి దిగుతోంది. దీనికి కౌంటర్ గా సీఎం జగన్ కొత్త ఫార్ములా తో దీనికి చెక్ పెట్టేందుకు సిద్దం అవుతన్నట్లుగా సమాచారం.

తటస్థ ఓటర్లు - ప్రముఖలను ఆకట్టుకొనేలా
అందులో భాగంగా.. తమ పార్టీలోకి తటస్థులకు అవకాశం కల్పించాలనే కసరత్త చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ పార్టీకి చెందని మేధావులు - బ్యూరోక్రాట్లు.. రిటైర్డ్ సివిల్స్ అధికారుల తో పార్టీ పరంగా సమావేశాలకు సిద్దం అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆర్దిక స్థితి గతులు..తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్దిక పరిస్థితి - కరోనా ఎఫెక్ట్ - తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతో రానున్న రోజుల్లో గ్రామీణ - పేదల కుటుంబాల్లో వచ్చే కొత్త మార్పుల గురించి వారితో షేర్ చేసుకొనేలా వర్క్ షాప్ లు నిర్వహించాలని ఆలోచన జరుగుతోందని తెలుస్తోంది. దీని ద్వారా.. తటస్థులను సైతం తన భవిష్యత్ ఆలోచనల్లో భాగస్వాములను చేయటం..అందులో రాజకీయంగా ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పింటచం పైన ఫోకస్ పెట్టాలనే చర్చ కొనసాగుతోంది.

మాజీ అధికారులకు బాధ్యతలు
2019 ఎన్నికల సమయంలోనే రిటైర్డ్ ఐఏఎస్ లు అజయ్ కల్లాం.. శామ్యూల్ వంటి వారు భిన్న వేదికల ద్వారా తమ వంతు సహకారం అందించారు. అదే విధంగా రిటైర్డ్ ఐఏఎస్ లు.. ఉన్నత విద్యా వేత్తలకు ఎంత మందికి తమ పార్టీ నుంచి టిక్కెట్లు ఇచ్చిందీ వివరించారు. ఈ సారి ఆ తటస్థులు.. మేధావులకు అవకాశం కల్పించటం ద్వారా.. టీడీపీ చేస్తున్న ప్రచారం.. ఎత్తుగడలకు కౌంటర్ ఇవ్వాలనేది వైసీపీ అధినేత ఆలోచన. అదే సమయంలో వైసీపీ ఏ వర్గానికి దూరం కాదని స్పష్టం చేసే విధంగా కొత్త అడుగులు వేయనున్నారు. ప్రధానంగా ఈ సారి కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను ఆకర్షించేలా ఉద్యోగాల కల్పనతో పాటుగా. .రాజకీయంగా వారిని ఆకర్షించేలా కొత్త ప్రణాళికలకు కసరత్తు మొదలైంది.

యువత - అస్త్రాలపై ఫోకస్
టీడీపీ 40 శాతం సీట్లు యువతకు ఇస్తామని చెప్పటం.. వైసీపీ హాయంలో ఉద్యోగాలు లేవని టీడీపీ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ గా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం. ఏ వర్గాన్ని విస్మరించకుండా.. ఏ వయసు వారు పక్క పార్టీ వైపు చూడకుండా.. తమతో కలిసి నడిచేలా కొత్త ఫార్ములా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కసరత్తు సాగుతోంది. నిజంగా..టీడీపీకి ప్రధానంగా మద్దతిచ్చే వారిగా చెప్పుకొనే వారిని మరోసారి వైసీపీ తమ వైపు నిలబెట్టుకోగలిగితే విజయం ఖాయని విశ్లేషకుల అంచనా. దీంతో..ప్లీనరీ సమయానికి ఈ మొత్తం వ్యవహారం పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications