Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు వ్యూహాలకు జగన్ కౌంటర్ స్కెచ్ - నేరుగా రంగంలోకి..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. పొత్తుల లెక్కలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. సీఎం జగన్ ఈ రోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం ఖాయం గా కనిపిస్తున్న వేళ జగన్ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో మూడు స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. చంద్రబాబు వ్యూహాలకు జగన్ కౌంటర్ స్కెచ్ సిద్దం చేస్తున్నారు.

కీలక పరిణామాలు : ఏపీలో పొత్తుల రాజకీయాల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వచ్చే అంశం పైన దాదాపు ఏడాదిన్నార కాలంగా రెండు పార్టీలు నిరీక్షిస్తున్నాయి. ఇక ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పొత్తుల పైన స్పష్టత దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం తరువాత పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రధానితో సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. దీంతో..పొత్తు ప్రకటన ఉంటుందా.. ఆగిపోతుందా అనే చర్చ తెర మీదకు వచ్చింది. ప్రధానితో సీఎం జగన్ సమావేశం పూర్తిగా అధికారిక అంశాలే అని చెబుతున్నా..రాజకీయ సమీకరణాల వేళ..కీలక అంశాలే చర్చకు వస్తాయని భావిస్తున్నారు.

CM Jagan one to one meeting with Ticket rejected MLAs assured for poliltical future

హోరా హోరీగా : ఇటు రాజ్యసభ లో పోటీ చేసేందుకు వైసీపీ ముగ్గురు అభ్యర్దులను ప్రకటించింది. సభలో సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు గెలుచుకోవాలని జగన్ భావిస్తున్నారు. మూడు స్థానాలు గెలిస్తే తెలుగుదేశం తొలి సారిగా రాజ్యసభలో ఒక్క సభ్యుడు లేకుండా ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. బీజేపీ తో పొత్తు పైన స్పష్టత వస్తూ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్దిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికల వేళ టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అభ్యర్దులను ప్రకటించటం తో పాటుగా టీడీపీ ప్రయత్నాల పైన కన్నేసారు. అందులో భాగంగా వైసీపీలో సీట్లు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలతో టీడీపీ టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

CM Jagan one to one meeting with Ticket rejected MLAs assured for poliltical future

జగన్ మంత్రాంగం : దీంతో సీఎం జగన్ నేరుగా అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. సీట్లు దక్కని వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. సీట్లు ఎందుకు ఇవ్వలేదనేది వివరించి చెబుతున్నారు. తాజాగా అసెంబ్లీలో సీట్లు దక్కని కాపు రామచంద్రారెడ్డి, గుమ్మనూరి జయరాం, మల్లాది విష్ణుతో సీఎం మాట్లాడారు. అంతా ఒకే కుటుంబంగా ఉన్నామని..అలాగే ఉంటామని సీఎం చెప్పుకొచ్చారు. పరిస్థితుల కారణంగా సీట్లు ఇవ్వలేక పోయిన విషయాన్ని వివరించారు. మీరంతా ఉంటేనే..తాను ఉండేదని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని..ప్రభుత్వంలో తిరిగి రాగానే తగిన ప్రాధాన్యత ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. దీంతో వారు కూడా సహకరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో..ఈ వారంలో ఢిల్లీలో పొత్తుల పైన చోటు చేసుకొనే పరిణామాలు.. రాష్ట్రంలో పార్టీల్లో చేరికలతో ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తి కరంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+