తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం - కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశం: రేపు సీఎం ఏరియల్ సర్వే ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో భారీ వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలిచ్చారు. జిల్లాల్లో పరిస్థితుల పైన వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రభావం ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపింది. నెల్లూరుకు సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు సీనియర్‌ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌లను నియమించారు. వర్షాలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు..స్థానిక పరిస్థితులను వివరించారు.

నిధుల కొరత లేదు..చర్యలు చేపట్టండి

నిధుల కొరత లేదు..చర్యలు చేపట్టండి


తమిళనాడులో తీరందాటిందని..దీని ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిశాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోందని వివరించారు. చెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు సమాచారం వస్తోందని సీఎం అడిగారు. ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించామని అధికారులు చెప్పారు. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టామన్నారు. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వివరించారు.

ప్రతీ కుటుంబానికి రెండు వేలు ఇవ్వండి

ప్రతీ కుటుంబానికి రెండు వేలు ఇవ్వండి


ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చారు. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని తెలిపిన అధికారులు సీఎంకు నివేదించారు. దీనిపై తగిన కార్యాచరణను సిద్ధం చేయాలన్న సీఎం..బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సూచించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం స్పష్టం చేసారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్న సీఎం..బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. మంచి భోజనం, తాగునీరు అందించాలని సూచించారు. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

తిరుమల భక్తులకు అండగా నిలవండి

తిరుమల భక్తులకు అండగా నిలవండి

తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం ఆదేశించారు. రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో వారిని కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలన్నారు. టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలి అధికారులకు స్పష్టం చేసారు. తిరుపతి నగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలన్నారు.

అదనపు సిబ్బందిని తరలించండి

అదనపు సిబ్బందిని తరలించండి

అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలని నిర్దేశించారు. రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా... నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని.. ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని..వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలన్నారు. సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు.

నష్టాలను నమోదు చేయండి

నష్టాలను నమోదు చేయండి

నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం..ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం..అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి..నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలని సూచించారు.

మరణించిన కుటుంబాలకు రూ 5 లక్షలు

మరణించిన కుటుంబాలకు రూ 5 లక్షలు

మరలా పంట వేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలన్నారు. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. శనివారం ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

English summary
CM Jagan had ordered the Collectors to help financially to those families who have lost their loved ones due to heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X