సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సీఎం జగన్
వైసీపీ అధినేత, సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర -2 సినిమా పోస్టర్లు సోషల్ మీడియాను షేక్‌ను చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవిత కథతో 'యాత్ర' సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు వచ్చిన 'యాత్ర' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ఆర్ పాత్రలో మళయాళ నటుడు మమ్ముట్టి నటించారు.

సినిమాలో మమ్ముట్టి నటనకు విమర్శకుల ప్రశంసలు కుడా దక్కాయి.వైఎస్ఆర్‌గా మెప్పించడంలో మమ్ముట్టి సూపర్ హిట్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా 'యాత్ర - 2' తెరకెక్కుతుంది. 'యాత్ర' సినిమాకు దర్శకత్వం వహించిన మహీ వి రాఘవ..'యాత్ర -2' కూడా దర్శకత్వం వహిస్తున్నారు. జగన్ పాత్రను తమిళ హీరో జీవా పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌లో జీవా అచ్చుగుద్దినట్టు జగన్ మాదిరిగా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ పాత్రలో జీవా జీవించేశాడని దర్శకడు మహీ వి రాఘవ చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్‌లో వైఎస్ఆర్ గురించి చూపించిన దర్శకుడు..రెండో భాగంలో ఆయన తనయుడు జగన్ రాజకీయ జీవిత చరిత్ర గురించి చూపించనున్నారు.

సీక్వెల్‌లో జగన్ ఓదార్పు యాత్ర, వైసీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో జగన్ సీఎం కావడం తదితర అంశాల్ని చూపించబోతున్నారని ఈ పోస్టర్స్‌ని చూస్తేనే అర్థం అవుతుంది. యాత్ర -2 సినిమాను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం యాత్ర- 2కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications