Teachers Day : గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... సీఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.'చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్‌ డే శుభాకాంక్షలు.' అని ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఉపాధ్యాయ లోకానికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.'ఉపాధ్యయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యయ లోకం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కరోనా సంక్లిష్ట కాలంలోనూ విద్యార్థుల ప్రయాణానికి ఉపాధ్యాయులు భరోసానివ్వడం ప్రశంసనీయం.' అని పేర్కొన్నారు. టీచర్స్ సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకుంటున్నట్లు తెలిపారు.

cm jagan praises teachers and wished them on teachers day

భారతరత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతోంది.ఆ రోజున ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను స‌న్మానిస్తారు. అలాగే చ‌దువు చెప్పిన గురువుల‌ను గుర్తు చేసుకుంటారు.

ఏ సమాజంలో అయినా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం గురువుదే. భారతదేశంలో గురువును సాక్షాత్తూ దేవుడితో సమానంగా పూజించే సంస్కృతి ఉంది. నేటి బాలలే.. రేపటి పౌరులు... ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా.. బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా.. ప్రగతి రథ సారధులుగా నిలిపేవారే.. ఉపాధ్యాయులు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని అక్టోబ‌ర్ 5వ తేదీన జ‌రుపుకుంటారు. మొద‌టి సారిగా దీన్ని 1994లో ప్రారంభించారు. యునెస్కో,ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సంయుక్తంగా వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డేను నిర్వ‌హిస్తున్నాయి. స‌మాజంలో టీచ‌ర్ల పాత్ర,బాధ్యతను తెలియజేసేందుకు... టీచ‌ర్లు విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను బోధించేలా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ప్ర‌తి ఏటా అంత‌ర్జాతీయంగా అక్టోబ‌ర్ 5వ తేదీన ప్ర‌పంచ ఉపాధ్యాయుల దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఆరోజు ప్రపంచవ్యాప్తంగా 100 పైచిలుకు దేశాల్లో టీచర్స్ డేని జరుపుతారు. భారత్‌లో మాత్రం సెప్టెంబర్ 5న దీన్ని నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+